- Advertisement -
మాజీ ఎంపి నందిగం సురేష్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ
Former MP Nandigam Suresh faced a setback in the Supreme Court
న్యూఢిల్లీ
మాజీ ఎంపీ నందిగం సురేష్కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో నందిగం సురేష్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించిది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేసారని ఆరోపణ. తనకు వస్తున్న పెన్షన్ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్ను మరియమ్మ దూషించింది. నందిగం సురేష్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేసి ఆమెను హతమారక్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాడు. ముందుగా ఏపీ హైకోర్టు నందిగం సురేష్ బెయిల్ ను తిరస్కరించింది. దాంతో అయన హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
- Advertisement -