గడ్డం వంశి కృష్ణ నుఅత్యధిక మెజార్టీతో గెలిపించాల
కమాన్ పూర్
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నేత ల శీను బాబు అన్నారు. సోమవారం రామగిరి మండలం కలవచర్ల శ్రీరామాంజనేయ స్వామి దేవాలయంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తో కలిపి శీను బాబు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా శీను బాబు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతి కార్యకర్త గెలుపు నకు కృషి చేయాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడడమే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ధ్యయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్లతిరుపతి యాదవ్ ఎంపీపీ ఆ రెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.