దేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీజీ
Gandhiji is one of the foremost leaders who achieved independence for the country-గాంధీజీ విగ్రహానికి నివాలర్పించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని
ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. గాంధీ జయంతి సంధర్బంగా మంథని లోని గాంధీజీ విగ్రహానికి పూల మాలవేసి నివాలర్పించారు. ఈ సందర్బంగా మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు గాంధీజీని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారన్నారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలని అన్నారు. ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రయాణం వందకు వంద శాతం గాంధీ చూపిన శాంతియుత మార్గంలో సాగుతుందని, గాంధీ చెప్పిన ప్రతి మాటను ఆచరిస్తున్న వ్యక్తి శ్రీధర్ బాబు అని అన్నారు. అటువంటి శ్రీధర్ బాబు నాయకత్వంలో తామంతా పనిచేస్తున్నందుకు గర్విస్తున్నామని అన్నారు. గాంధీ చూపిన మార్గంలో, శ్రీధర్ బాబు నాయకత్వంలో ముందుకు సాగుతామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాం రాజశేఖర్, మంథని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




