21 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ
హైదరాబాద్, ఏప్రిల్ 16,
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు ఫిబ్రవరి 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అర్హులైన వారి నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 లక్షల మంది లబ్ధి పొందారు. ఇప్పటి వరకు 21 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు.2023 ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించారు. ఈగ్యారెంటీలో రెండు హామీలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఉచిత బస్సు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉచిత బస్సును ప్రారంభించారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతులు, మహిళలు ఆధార్ కార్డు చూపిస్తు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.ఇదే మహాలక్ష్మీ పథకంలో రెండో హామీ రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. దీనిని ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అప్పటి వరకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తరువాత 38,33,615 మంది అర్హులుగా తేల్చింది. వీరు ముందుగా గ్యాస్ సిలిండర్ ను అప్పుడున్న ధరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వారి ఖాతాల్లోకి రూ.500 పోను మిగతా మొత్తం రిటర్న్ గా వస్తుంది. గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 18,86,045 మంది ఖాతాల్లోకి రూ.500 మినహా మిగతా మొత్తం నగదు జమ అయింది. ఇంకొందరు రెండో సిలిండర్ తీసుకొని రాయితీ పొందారు. ఇలా మొత్తం 21,29,460 మంది ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తం వేసినట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే చాలా మంది దరఖాస్తు చేసుకున్నా సబ్సిడీని పొందలేదు. అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
21 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ
- Advertisement -
- Advertisement -