- Advertisement -
గ్యాస్ ట్యాంకర్ బోల్తా… అధికారుల అప్రమత్తం
Gas tanker overturned... officials alerted
చెన్నై
ప్రమాదకర గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తురు శివారులో చోటుచేసుకుంది. అవినాశి లోని ఫ్లై ఓవర్‌పై ఓ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదంలో ట్యాంకర్‌కు డ్యామేజ్ అవ్వడంతో లిక్విడ్ గ్యాస్ వేగంగా లీక్ అవుతోంది. అయితే, భారీ పేలుడు సంభవించే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు ఫ్లై ఓవర్ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కిలో మీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలలను మూసివేయించారు. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు స్పాట్‌కు చేరకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
- Advertisement -