జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్..!!_
వాయిస్ టుడే:
Gazette notification for population census on June 16th..!!
* ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ జనాభా గణన ప్రక్రియ వేగంగా సాగుతోంది. సోమవారం (జూన్ 16) జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆదివారం హోంమంత్రి 16 జనాభా గణనపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 16 వ జనాభా గణన 2027లో జరగనుంది. మొత్తం రెండు దశల్లో జనాభాగణన జరుగనుంది. మొదటి దశలో ఇంటి జాబితా ఆపరేషన్ ద్వారా గృహాల పరిస్థితి, ఆస్తులు, సదుపాయాలకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. రెండవ దశలో జనాభా గణన చేస్తారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక ,ఇతర వివరాలు సేకరిస్తారు.ఇందులో కులగణన కూడా నిర్వహించనున్నారు. కులం గణన:1931 తర్వాత తొలిసారిగా ఈ జనాభా గణనలో కులాల వివరాలు కూడా సేకరించనున్నారు. ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా నిర్వహించునున్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మార్చి 1, 2027నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణను చేపట్టనున్నారు. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో మాత్రం ముందుగా అంటే అక్టోబర్ 1, 2026నుంచి జనాభాగణన నిర్వహించనున్నారు. ఈ భారీ ప్రక్రియ కోసం సుమారు 34 లక్షల ఎన్యూమరేటర్లు ,సూపర్‌వైజర్లు1.3 లక్షల మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. నిధులు: జనాభా గణన ప్రక్రియకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత 8వ జనాభాగణన. మొత్తం మీద 16వ జనాభా గణన. గతంలో 2021లో జరగాల్సిన జనాభా గణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.