- Advertisement -
బెజవాడలో సాధారణ పరిస్థితులు
General conditions in Bejwadaవిజయవాడ, సెప్టెంబర్ 11 (న్యూస్ పల్స్)
ఎప్పుడూ పడని వర్షపాతం… ఎన్నడూ చూడని వరుణ బీభత్సంతో వరదవాడగా మారిన విజయవాడ… దాదాపుగా సాధారణ స్థితికొచ్చింది. మొన్నటివరకు కనపడని రోడ్లు, భవనాలు…ఇప్పుడు శుభ్రంగా మెరుస్తున్నాయి. మోటార్ సైకిళ్లు రయ్యన తిరుగుతున్నాయి. మనుషులు సైతం ఎలాంటి భయం లేకుండా బయటకొచ్చే పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, స్వచ్చంధ సేవకులు… ఇలా ఎందరో 10 రోజులు పాటు సమయం చూసుకోకుండా పనిచేశారు. బెజవాడను యథాస్థితికి తెచ్చేందుకు మూడు షిఫ్టుల్లో కష్టపడ్డారు. ఫలితంగా బెజవాడ ఊపిరి పీల్చుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం వరదపై అలుపెరగని పోరాటం చేశారు. 10 రోజలపాటు విజయవాడ కలెక్టరేట్లోనే బస చేశారు. ప్రతిరోజూ వరద ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకయ్యారు.. వారిలో భరోసా నింపారు.ముమ్మర సహాయక చర్యలతో.. 90 శాతం నగరం యాథాస్థితికొచ్చింది. విద్యుత్ పునరుద్ధరణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఇప్పటిదాగా 30వేల 545 ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేశారు. 66 వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా… ముంపు ప్రాంతాల్లోని 90 శాతం ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించి వినియోగంలోనికి తెచ్చారు. 421 కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్త తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, సెల్లార్‌లోని నీటిని మోటార్లతో వెళ్లగొట్టి నగరాన్ని నార్మల్ సిచ్యువేషన్‌కి తీసుకొచ్చారు. దీంతో ప్రతి కష్టపడిన ప్రతిఒక్కరిని అభినందించారు సీఎం చంద్రబాబు.విజయవాడ కోలుకోవడంతో.. కాకినాడ జిల్లాపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఏలేరు ప్రాజెక్టు విజృంభిస్తుండటంతో… పదుల సంఖ్యలో గ్రామాలు మునిగాయి. పలుచోట్ల కాల్వలకు గండ్లు పడటంతో… వందలాది ఎకరాలు నీట మునిగాయి. 10 సంఖ్యలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినా… వాటిని వరద ముట్టుముట్టింది. దీంతో ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు చంద్రబాబు.మొత్తంగా… వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు.. వరదల నుంచి కోలుకున్న తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్మీకి మించి రామనాయుడు
విజయవాడను ముంచెత్తిన వరదలకు కారణం బుడమేరకు గండ్లు పడటం. అవి చిన్న చిన్న గండ్లు కాదు. ప్రవాహం ఉన్నప్పుడు వాటిని పూడ్చాలంటే..అసాధ్యం. అది పూడ్చకపోతే విజయవాడకు ముంపు ఆగదు. అందుకే .. బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చడానికి ప్రభుత్వ యంత్రాంగం చేయని ప్రయత్నం లేదు. మొదటి రెండు గండ్లను సులువుగానే పూర్తి చేసినప్పుడు మూడో గండిని పూడ్చడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. విజయవాడ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరిస్థితిని వివరించడంతో ఆర్మీని తెప్పించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఆపరేషన్లలో అనుభవం ఉన్న ఆర్మీ బృందం విజయవాడ వచ్చింది. బుడమేరులో గండి పూడ్చే ప్రయత్నాల్లో పాల్గొంది. అయితే ఆర్మీ అధికారులకు అది కొరుకుడుపడలేదు. కొన్ని సలహాలు ఇచ్చి వారు వెళ్లిపోాయరు. అయితే బుడమేరు గట్టు మీదనే ఉంటూ.. మంత్రి నిమ్మల రామానాయుడు .. ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఓ వైపు ఆగని వర్షం.. తరచూ పెరిగే వరదతో.. యుద్దం చేస్తూ.. గండి పూడ్చేపనులు కొనసాగించారు. కొన్ని ప్రైవేటు సంస్థల వాహనాలతో.. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు విస్తృత ప్రయత్నాలు చేశారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా యుద్ధమే చేశారు. ఫలితంగా చివరికి గండి పూడ్చగలిగారు. వదలను ఆపారు. అయితే అంతటితో వదిలేస్తే.. మళ్లీ గండి పడే ప్రమాదం ఉందని.. మరింత ఎత్తుగా కట్టను బలోపేతం చేసే వరకూ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారులు, మంత్రి రామానాయుడు చేసిన ప్రయత్నాలను ఏలూరు పర్యటనలో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆర్మీ కూడా వల్ల కాలేదని చెబితే.. మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులే యుద్ధం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు.. అధికారులు చేసిన కృషిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అత్యంత ప్రమాదకరంగా మారిన బుడమేరకు మరోసారి వరదలు రాకుండా చేసేందుకు రీటైనింగ్ వాల్ కూడా కట్టే ఆలోచన చేస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబునాయుడు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పది రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ లోనే మకాం వేసి… బస్సులోనే విశ్రాంతి తీసుకుని.. సహాయ చర్యలను పరిశీలించారు. విజయవాడ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతనే ఆయన ఉండవల్లి నివాసానికి వెళ్లారు.
- Advertisement -




