గోవా టు హైదరాబాద్… డ్రగ్స్ దందా

- Advertisement -

హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్ మోకిలా పోలీస్ స్టేసన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఓ లేడీ కీలక పాత్ర పోషించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహిళతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. వారివద్ద నుంచి మూడు వెహికల్స్, 48 గ్రాముల ఎమ్ డీఎమ్ఎ, 8గ్రాముల క్రషింగ్, 51 గ్రాముల కొకైన్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని చెప్పారు. డ్రగ్స్ విలువ 14 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.ఈ కేసులో కీలక సూత్రదారి అయిన అనురాధ భర్త డ్రైవర్ గా పనిచేసేవాడు. అయితే అతను రెగ్యులర్ గా గోవాకు వెళ్తుంటాడు. గోవాలో నైజీరియాకు చెందిన జేమ్స్ తో పరిచయం ఏర్పడింది. జేమ్స్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి.. హైదరాబాద్ కు తరలించారు.గోవాలో జేమ్స్ వద్ద ఒక గ్రాముకు10 వేలు చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసి.. హైదరాబాద్ లో గ్రాము 20వేలకు విక్రయించారు. డ్రగ్స్ అమ్మకంలో వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఈమెకు సహకరించాడని తెలిపారు. ప్రభాకర్ రెడ్డి డ్రగ్ కన్జ్యూమర్ గా ఉంటూ ఫెడ్లర్ గా మారాడని వివరించారు. గుంటూరుకు చెందిన శివ అనే వ్యక్తి కూడా అనూరాధకి డ్రగ్ అమ్మకంలో సహకరించాడు.

Goa to Hyderabad... Drug bust
Goa to Hyderabad… Drug bust
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular