గోబెల్స్ ప్రచారం చేస్తున్న కేసీఆర్
మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్
మాజీ సీఎం కేసీఆర్ పదే పదే అబద్దాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పదేండ్లు సీఎం గా పని చేసి పచ్చి అబద్దాలు చెప్పారని నీటి పారుదల శాఖ, పౌర సంబంధాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజాలు
చెప్పాలసిన బాధ్యత మంత్రులుగా మాపై ఉంది. విద్యుత్ విషయంలో 7 వేల మెగావాట్ల నుంచి 12 వేలకు పెంచామని చెప్పటం పచ్చి అబద్దం. పదేళ్లలో వాళ్లు స్టార్ట్ చేసి పూర్తి చేసింది కేవలం భద్రాద్రి పవర్ ప్లాంట్. ఆది
కూడా అవుట్ డెటెడ్. కాళేశ్వరం నేను రిపేర్ చేస్తా అని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ హయాంలోనే కదా అది నాశనం అయ్యింది. కాళేశ్వరం మీద 95 వేల కోట్లు ఖర్చు చేశారు. పూర్తి చేయాలంటే 1.5 లక్షల కోట్లు
అవుతుందని అన్నారు.
మేడిగడ్డ కుంగింది అక్టోబర్ 21, 2023 న. మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7 న. కుంగిన 45 రోజులకు కూడా కేసీఆర్ నోరు మెదపలేదు. ప్రాజెక్టు కుంగిన తర్వాత నీళ్లు వదిలింది మీరే, కానీ నెపం మాపై
నెడుతున్నారు. 104 ఎమ్మెల్యేల నుంచి 39 కు పడిపోయారు. అందులో నుంచి 25 మంది కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎంపీ సీట్లు బిఆర్ఎస్ కు ఒక్కటీ రాదని అన్నారు.
కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ దారుణ మోసం చేశారు. మొత్తం ఉమ్మడి ఏపీ లో కృష్ణాలో 811 టీఎంసీ లలో ఉంటే రాష్ట్ర విభజన తర్వాత 299 టీఎంసీలకు ఒప్పుకొని తెలంగాణ కు తీరని నష్టం చేశారు. కేసీఆర్
ఒప్పందం వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు నష్టం జరిగింది. కేసీఆర్ హయాంలో 7031 వరి కొనుగోలు కేంద్రాలు పెడితే మేము 7200 కేంద్రాలు పెట్టాం. గతేడాది కంటే ఈ సారి 15 రోజులు ముందే
కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశామని అన్నారు.