- Advertisement -
శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామికి బంగారు ఆర్చి
Golden Arch of Lord Shaniswara in Srikalahasti Templeకాళహస్తి
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసి ఉన్న శ్రీ శనీశ్వర భగవాన్ కి బంగారు పూతతో కూడిన ఆర్చిని దాతలు చేయించారు. తమిళనాడుకు చెందిన ఏ.ఏం.ఆర్ సంస్థ చెందిన మనోజ్, మహేష్ దాతలతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంగారు ఆర్చిని ఆవిష్కరించారు. దాతలు ఎంతో భక్తిశ్రద్ధలతో ముందుకు వచ్చి సుమారు కోటి రూపాయలు వెచ్చించి బంగారు ఆర్చిని తయారు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శనీశ్వరుని భగవాన్ మూలవిరాట్ చుట్టూ బంగారు తాపడం చేసిన ఆర్చిని ఆకర్షణీయంగా శోభితంగా కళాకారుడు గిరి ప్రకాష్ ఆధ్వర్యంలో అద్భుతంగా తీర్చిదిద్దారు.ఈ బంగారు ఆర్చిని శనివారం దాతలతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.వి.ఎస్ మూర్తి, స్థానిక దేశం నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -




