హైదరాబాద్, అక్టోబరు 17, (వాయిస్ టుడే): ప్రవళిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేశారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. ప్రవళిక సూసైడ్ పై ప్రభుత్వం, కేటీఆర్, పోలీసుల అసత్య ప్రచారం పై నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్, AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ, నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు హాజరయ్యారు. ప్రవళిక సూసైడ్ చేసుకొని ఒకసారి చనిపోతే.. ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేసి మరోసారి చంపేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం ధ్యేయంగా హైదరాబాద్ కి వచ్చి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతనే.. ఇంటికి వస్తా అని ఇంట్లో చెప్పింది ప్రవళిక అన్నారు. పేపర్ లీకేజ్, పరీక్ష రద్దు వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి తమ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవళిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు.ప్రవళిక సూసైడ్ ని ఎదుర్కోలేక.. అమ్మాయి వ్యక్తిత్వం దెబ్బతీయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాల విషయంలో కేటీఆర్ చెప్పిన గణాంకాలన్నీ తప్పుడు లెక్కలే అన్నారు. రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ ప్రకటనపై చర్చకు సిద్దమన్నారు. జాబ్ క్యాలెండర్ ఇయర్ ప్రకటించడం లేదన్నారు. TSPSC ని రద్దు చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలన్న స్పందన లేదని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేదన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS మేనిఫెస్టోలో పెన్షన్, రైతుబంధు, గ్యాస్ ధర తప్ప.. ఎక్కడా ఉద్యోగాలపైన లేదంటూ మండిపడ్డారు. మేనిఫెస్టోలోనే నిరుద్యోగులు లేకపోతే.. వాళ్ళ విధానాల్లో ఎక్కడ ఉంటామన్నారు. నిరుద్యోగులపై అడిగే ప్రశ్నలకు ఒక్క సమాధానం ఇస్తే.. ముక్కు నాలకు రాస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడుతాం అంటే.. ఎలక్షన్ కోడ్ వస్తుందని పోలీసులు అంటున్నారని అన్నారు. ప్రవళిక పైన వాస్తవాలు చెప్పాలని ప్రెస్ మీట్ పెడితే.. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతం నుంచి తన కలలను నిజం చేసుకోవాలని ప్రవళిక హైదరాబాద్ కి వచ్చిందని AICC స్పోక్స్ పర్సన్ డాలీ శర్మ అన్నారు. ఈ ప్రభుత్వం పేపర్ లీక్ చేసి, ఎగ్జామ్స్ వాయిదా చేయడం వల్ల… సూసైడ్ చేసుకుందని అన్నారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల హైదరాబాద్ లో ఉండి.. హాస్టల్స్ లో ఉండి.. ప్రిపేర్ అవ్వాలంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని తెలిపారు. దీంతో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, వాళ్ల పేరెంట్స్ పై ప్రెజర్ పెరిగిపోతుందన్నారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రవళిక పై డిప్రెషన్ పెరిగిపోయి సూసైడ్ చేసుకుందని తెలిపారు. కేవలం ప్రవళిక నే కాకుండా… చాలా మంది స్టూడెంట్స్ పై ప్రెజర్ పెరిగిపోతుందన్నారు. ప్రవళిక పైన BRS ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రవళిక కారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసే వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి నిజాలు తెలుసుకోకుండా ప్రవళిక గ్రూప్స్ కి అప్లై చేయలేదని ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. ప్రవళిక ఇంటికి వెళ్లి నిజానిజాలు తెలుసుకున్నామన్నారు. ఒక తెలంగాణ ఆడబిడ్డ కారెక్టర్ గురించి ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.