ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ కార్యక్రమం

- Advertisement -

ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ కార్యక్రమం

Grand international coastal cleanup program under auspices of Indian Coast Guard

కాకినాడ
కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో శనివారం తీరప్రాంత పరిశుబ్రతా కార్యక్రమం   నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వివిధ కంపెనీల ప్రతినిధులు తో పాటు సూర్యరావుపేట గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కాకినాడ మున్సిపల్ ఉద్యోగులు, కోస్టల్ పోలీసులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బీచ్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓఎన్జిసి  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నాష్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో అధిక శాతం ప్రజలు ప్లాస్టిక్ నీ అత్యధికంగా వినియోగిస్తున్నారని దీనివల్ల పర్యావరణం పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగం పూర్తి స్థాయిలో వాడకుండా  ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తమ బందువులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులుచే ప్లాస్టిక్ వినియోగానీకి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో  కోస్ట్ గార్డ్ స్టేషన్  కమాండర్ కమాండెంట్ రాజేంద్ర కుమార్, కనకలత  బరువా షిప్  కమాండింగ్ ఆఫీసర్  కమాండెంట్  ఆర్ఎస్ఎస్ బీశెట్టి, కాకినాడ సీ పోర్టు సీఈవో మురళిధర్ , రిలయన్స్ కంపెనీ నుండి  లంక మురళి పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular