Thursday, December 12, 2024

గ్రూప్ 2 ..  హైకోర్టులో పిటిషన్‌

- Advertisement -
group-2-petition-in-high-court
group-2-petition-in-high-court

హైదరాబాద్  ఆగస్టు 11, వాయిస్ టుడే:  తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఒకే నెలలో ముఖ్యమైన పరీక్షలను నిర్వహిస్తుండటంతో.. తమకు అన్యాయం జరుగుతోందని, గ్రూప్-2 పరీక్ష వాయిదావేయాలని కొందరు అభ్యర్థులు కోరుతుండగా.. ఒకే పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మాత్రం పరీక్ష నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాలు విజ్ఞప్తులు చేస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే వీటిపై టీఎస్‌పీఎస్సీ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. గ్రూప్‌-2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున రెండురోజుల సమయం పడుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే గ్రూప్-2 పరీక్ష షెడ్యూలు ప్రకారమే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్షల షెడ్యూలును కమిషన్ ఆరు నెలల క్రితమే ప్రకటించింది. మరోవైపు, ఆగస్టులో గురుకుల పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో గురుకుల, గ్రూప్-2 పోస్టులు రెండింటికీ దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వాటిలో ఏదో ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేయాలంటూ గురువారం కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు, పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని కమిషన్ సహాయ కేంద్రానికి మరికొందరు అభ్యర్థులు విజ్ఞప్తులు పంపించారు. పరీక్ష కోసం ఉద్యోగాలకు సెలవులు పెట్టామని, రాజీనామా చేశామని.. ఎనిమిది నెలలుగా సన్నద్ధమవుతున్నామని వారు చెబుతున్నారు. కాగా, గ్రూప్-2 పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించేందుకు కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన విద్యాసంస్థలకు సెలవులూ ప్రకటించింది. వాయిదా వేస్తే భవిష్యత్తులో పరీక్ష తేదీలు దొరకడం కష్టమని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి.

గ్రూప్‌ 2 వాయిదా… చర్చించి నిర్ణయం తీసుకుంటాం

తెలంగాణలో ‘గ్రూప్‌-2’ పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు ‘గ్రూప్‌-2’ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ డి.మహేశ్‌తో పాటు 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల నియామక బోర్డు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్నందువల్ల.. గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-2 వాయిదాపై బోర్డు అధికారులు రెండు రోజుల సమయం అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. దీంతో బోర్డు అధికారులు బోర్డుపై నమ్మకంలేదు.. చైర్మన్‌ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.

తెలంగాణలో ‘గ్రూప్‌-2’ పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు ‘గ్రూప్‌-2’ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 9, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-2ను రీషెడ్యూల్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్