గూడెంనియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా

- Advertisement -

గూడెంనియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా

Gudem will commit to the comprehensive development of the constituency

తాడేపల్లిగూడెం నియోజకవర్గం,రామన్నగూడెం నందు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం,సెప్టెంబర్ 26,
నియోజవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని రాబోయే రోజుల్లో అభివృద్ధి పరుగులు పెట్టేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని రామన్నగూడెం లో నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. పాలన చేతకాని మాఫియాడాన్ చేతిలో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని అప్పగించి రాష్ట్ర మూలాలు దెబ్బ తినే విధంగా రాష్ట్రం నిర్వీర్యం చేశారన్నారు. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లిన గోతుల రోడ్లు దర్శనమిస్తున్నాయని, పారిశుధ్యం అతలా కుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్ర మూలాలు దెబ్బ తినే పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి ప్రజల సంక్షేమం దశగా, రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి పనిచేస్తున్నామన్నారు.దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని తెలిపారు. అంతేకాకుండా గత వైసీపీ అవినీతి పాలనలో భాగస్వామ్యులైన మంత్రులు సిగ్గు లేకుండా ప్రజలోకి వచ్చి మాట్లాడడం దౌర్భాగ్యం అన్నారు.టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరు, గ్రామాల్లో రోడ్లు, నిర్మించి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తారని స్పష్టం చేశారు. ముందుగా గ్రామంలో 65 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు భూమి పూజ నిర్వహించి, గ్రామంలోని జలజీవన్ పథకం ద్వారా 20 లక్షలతో పైపులైన్లను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహారం మహోత్సవంలో భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, సర్పంచ్ చింతా వెంకట్రావు, గ్రామ టిడిపి జనసేన అధ్యక్షులు రవితేజ, నాగరాజు, ఎంపీడీవో విశ్వనాధ్, ఆర్డబ్ల్యూఎస్  ఏఈ రాజా శ్రీనివాస్, కాళ్ళ గోపికృష్ణ, జనసేన నాయకులు పుల్లా బాబి, పాలూరు వెంకటేశ్వరరావు, పై బోయిన వెంకటరామయ్య,గుండుమోగుల సురేష్, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సూరి, బయనపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular