గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వర్యం అవుతోంది
ప్రాజెక్టును పరిశీలించిన వైఎస్ షర్మిల
ప్రకాశం
ఏపీసీసీ ఛీప్ షర్మిల శనివారం నాడు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని మండిపడ్డారు.
షర్మిల మాట్లాడుతూ ఇది వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్. 750 కోట్లు పెట్టీ కట్టారు..లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చారు. 12 మండలాల ప్రజలకు , ఒంగోల్ పట్టణానికి త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ అధికారులు నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకు పోయాయి అని చెప్పారు. మరమత్తులు చేయాల్సింది పోయి ప్రాజెక్ట్ నిర్వహణ లో లోపాలు అని చెప్తున్నారని అన్నారు. టీడీపీ జలయజ్ఞం దోపిడీ అని అర్థం లేని ఆరోపణలు చేసింది. ఇళ్లు కట్టుకున్నా..దానికి నిర్వహణ అవసరం. పట్టించుకోకుండా ఉంటే ఏదైనా తుప్పు పడుతుంది. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం గేట్లు కొట్టుకు పోతుంటే డ్యాన్సులు చేస్తుంది. మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్పా..పని చేయరు. జగన్ ఆన్న కు మరమత్తులు చేయించడానికి మనసు రావడం లేదట. ఇదేనా వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం అంటే. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్ట్ ను పట్టించుకోని నీరు ఎలా వైఎస్సార్ వారసులు అవుతారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి ..లేకుంటే ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. 10 కోట్లు ఇస్తే ఇస్తే ప్రాజెక్ట్ నిలబడుతుంది. ప్రాజెక్ట్ కింద వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు ను సైతం నిర్లక్ష్యం చేశారు. 40 TMC సామర్ధ్యం కలిగిన అతిపెద్ద ప్రాజెక్ట్ వెలుగొండ. 4.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ సైతం పక్కన పడింది. గత 10 ఏళ్లలో చంద్రబాబు,జగన్ ఆన్న తట్టెడు మట్టి కూడా మోయలదని ఆరోపించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వర్యం అవుతోంది
- Advertisement -
- Advertisement -