వాల్మీకి మహర్షి కి మనమెంతో ఋణపడ్డాం..
శేరిలింగంపల్లి బోయ వాల్మీకి సంఘం అధ్యక్షులు రత్న కుమార్…
శేరిలింగంపల్లి, వాయిస్ టుడే: గొప్ప మానవతావాది, మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను అడుగడుగునా మనకు భోదించే రామాయణం రాసిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ డివిజన్ లో గల సుభాష్ చంద్ర బోస్ నగర్ లో శేరిలింగంపల్లి బోయ సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి, కులామతాలకు అతీతంగా అందరూ పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి బోయ వాల్మీకి సంఘం అధ్యక్షులు నాయని రత్న కుమార్ మాట్లాడుతూ వాల్మీకి ధర్మాన్ని ఎలా రక్షించాలో వాల్మీకి మహర్షి తన రామాయణం ద్వారా ప్రజలకు అందించారని, మనిషి సన్మార్గంలో నడిచేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన శ్రీ ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆరెపల్లి చిన్నయ్య, సైదన్న పోతురాజు ప్రధానకార్యదర్శి కొంకల ఈశ్వరయ్య, వీరస్వామి, తులసి రాజు ఆర్గనైజింగ్ సెక్రటరి కొంకల నాగయ్య, కొంకల శ్రీవర్ధన్, జింకల అంజనేయులు, ఉప కార్యదర్శి కొమారి మద్దిలేటి నాని వీరంజనేయులు, సలహదారులు రాములు, గిరిబాబు మరియు కమిటీ సభ్యులు జల్లి రవి నాయుడు, మండ్ల రమేష్ బి.భాస్కర్, నాయిని పరుషరాముడు, కావలి నరసింహ్మ, బోగిమల్ల శ్రీరాముడు స్వామి, ముత్త సాయిబాబా, సా గాలయ్య, రాధకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


