హర్ ఘర్ తిరంగా ర్యాలీ…………

- Advertisement -

జాతీయవాదం, దేశసమగ్రతను    

పెంపొందిచడానికె హర్ ఘర్ తిరంగా ర్యాలీ
-బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

Har Ghar Tiranga Rally

మంథని

జాతీయవాదం, దేశసమగ్రతను    పెంపొందిచడానికె హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి తెలిపారు.బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సుమారు వేయి మంది విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు.బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండాపాక సత్యప్రకాష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
దేశ సమగ్రతను, జాతీయ వాదాన్ని, ఐక్యతను  కాపాడేందుకు ప్రధాని  నరేంద్ర మోడీ  పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను దేశవ్యాప్తంగా  ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ మూడు రోజులు మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ  వారి విగ్రహాలను శుద్ధి చేస్తూ, ప్రతి ఇంటిపై  జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ భావం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు  నిలయంగా మోడీ  పరిపాలన కొనసాగిస్తున్నారని   కాశ్మీర్ లాంటి సమస్యాత్మక  ప్రాంతాల్లో కూడా  మోడీ  పాలనలో  స్వేచ్ఛగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమలను నిర్వహించడం జరుగుతుందన్నారు. బంగ్లాదేశ్ హిందువులపై  జరుగుతున్న దాడిని  కాంగ్రెస్ పార్టీ ఖండించకపోవడం వారి ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనం అన్నారు ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular