‘తులాభారం’ మూవీ ఫస్ట్ డే షూట్ లో జాయిన్ అయిన హీరో రవితేజ  

- Advertisement -

 ‘తులాభారం’ మూవీ ఫస్ట్ డే షూట్ లో జాయిన్ అయిన హీరో రవితేజ  

Hero Ravi Teja has joined the first day of the shoot for the movie ‘Tulabharam’.

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ తులాభారం. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ యూనిక్ స్టయిల్ స్టోరీ టెల్లింగ్ కలగలిసి క్రైమ్, డ్రామా,

ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ విజయంతో జోరు మీదున్న రవితేజ.. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు

సిద్ధమవుతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు.
తులాభారం ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ తనదైన ఎనర్జీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం

సంపాదించుకున్నారు. అయితే ‘తులాభారం’తో ఆయన సరికొత్త ఐడెంటిటీ ని సొంతం చేసుకోబోతున్నారు. ఇందులో ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం

అవుతున్నారు. ‘నవ రవితేజం’గా  కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది.
తులాభారం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైయింది. తాజాగా హీరో రవితేజ తన ఫస్ట్ డే షూట్ లో జాయిన్ అయ్యారు. ఆయనతోపాటు కీలక నటినటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ

బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తున్నారు.  వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా

వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular