- Advertisement -
హిజ్రా లీడర్ హాసిని దారుణ హత్య
Hijra leader Hasini was brutally murdered
పెద్ద ఎత్తున నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న హిజ్రాలు..
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు
నెల్లూరు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు వద్ద దారికాచి హిజ్రా నాయకురాలు హాసిని ని కొందరు దుండగులు కత్తులతో పొడిచి దారుణ హత్య చేసారు. పోస్టుమార్టం నిమిత్తం హాసిని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి వద్దకు తరలించారు, దీంతో ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా లలోని హిజ్రాలు భారీ ఎత్తున నెల్లూరు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకొని నేలపై బైఠాయించి నిరసన తెలియజేశారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులో ఉంచుతున్నారు.. హాసినిది స్వస్థలం తిరుపతి కావడంతో తిరుపతి నుండి కూడా భారీగా హిజ్రాలు ఆమె తరపు వారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు…
- Advertisement -