Tuesday, April 22, 2025

తెలంగాణ ఎమ్మెల్యేలకు హనీట్రాప్…?

- Advertisement -

తెలంగాణ ఎమ్మెల్యేలకు హనీట్రాప్…?
హైదరాబాద్, మార్చి 25, (వాయిస్ టుడే)

Honeytrap for Telangana MLAs...?

తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టార్గెట్‌గా కొత్త రకం హనీట్రాప్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్ నెంబర్లను కనుక్కొని మరి వీడియో కాల్ చేసి బెదిరిస్తున్నారట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేహ శర్మ అనే పేరుతో వీడియో కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు మాత్రం ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ సైలెంట్‌గా ఉంటున్నారు.హాట్ టాపిక్‌గా మారడంతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అసెంబ్లీ లాబీలో, ఎల్పీ ముందు పలువురు నేతలు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. తనకు కాల్ వచ్చిందని ఒక ఎమ్మెల్యే చెప్పగా, తనకూ కాల్ వచ్చిందని మరో ఎమ్మెల్యే తన అనుభవం చెప్పుకొని గోడు వెళ్ళబోసుకుంటున్నారు.నేహ శర్మ అనే పేరుతో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాల్స్ వచ్చినా అనుమానంతో ఎత్తలేదని పలువురు ఎమ్మెల్యేలు తమ సహచర ఎమ్మెల్యేలతో చెప్పుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా గతంలో ఇలాగే హనీ ట్రాప్ కాల్ వచ్చింది. కాల్ చేసి 20 సెకండ్లు మాట్లాడి ఆ సమయంలో తాను ఇబ్బందికరంగా ప్రవర్తించి ఆ వీడియోను సదరు ఎమ్మెల్యేకి పంపించి 50 వేల రూపాయలు పంపించాలని డిమాండ్ చేశారు.డబ్బులు పంపకపోతే పక్క పార్టీ గ్రూపుల్లో వీడియో వేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో అలెర్ట్ అయిన ఎమ్మెల్యే వీరేశం జిల్లా ఎస్పీకి కాల్ చేసి విషయం చెప్పారట. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి లోపలేశారట.ఈ ట్రాప్ కాల్స్ పార్టీలకతీతంగా పలువురు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాల్ చేసి వీడియో రికార్డు చేసి బీఆర్ఎస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం, బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాల్ చేసి వీడియోలను రికార్డు చేసి కాంగ్రెస్ గ్రూపుల్లో వేస్తామని బెదిరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ తరచూ కాల్స్ వస్తుండటంతో నేతలు జాగ్రత్త పడుతున్నారు. ప్రజా ప్రతినిధిగా ఎవరో ఆపదలో ఉండి కాల్ చేస్తున్నారని ఎత్తితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనీ ట్రాప్ వ్యవహారం ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైంది. చేయని తప్పునకు బలి కావాల్సి వస్తుందేమోనని..పోనీ తమ తప్పేం లేదని చెప్పినా ఇలాంటి విషయాల్లో నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారట. లేడీ నుంచి కాల్ వస్తే చాలు భయపడిపోతున్నారట. ఎటుపోయి తమ మెడకు చుట్టుకుంటుందోనని..ఒకవేళ అలా బెదిరించి వీడియోను సర్క్యులెట్ చేస్తే ప్రజల్లో చులకన అయిపోతామని ఆందోళన చెందుతున్నారట. దీనిపై ప్రభుత్వం పూర్తిస్తాయి విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారట. ఇక ఈ ట్రాప్ వ్యవహారానికి పోలీసులు ఎలా ఫుల్ స్టాప్ పెడుతారనేది చూడాలి మరి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్