Saturday, September 14, 2024

జహీరాబాద్ కోసం భారీ పోటీ…ః

- Advertisement -

జహీరాబాద్ కోసం భారీ పోటీ…ః
మెదక్, మార్చి2
జహీరాబాద్ సీటును దక్కించుకోవాలని చూస్తున్నారు పలువురు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీజేపీ లోక్ సభ ఎన్నికలకి సిద్ధం అవుతుంది. ము1ఖ్యంగా తెలంగాణ పై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు పలు మార్లు ఇక్కడి బీజేపీ నేతలతో సమావేశం అయ్యి పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అత్యధికంగా ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ ప్లాన్ వేస్తుంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడి నుండి పోటీ చేయడానికి చాలామంది ఆశావహులు ఉన్నారు.ఎంపీ టికెట్‌ కోసం బీజేపీ పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. జహీరాబాద్ నుంచి బీజేపీలో ఆరుగురికి పైగా టికేట్ ఆశిస్తున్నారట. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్‌, అందోలు, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ సభ పరిధిలో ఉన్న ఏడింటిలో 4 కాంగ్రెస్, రెండు BRS, ఓ అసెంబ్లీ సీటు బీజేపీ గెలుచుకుంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెరిగి ఓటు శాతంతో కాషాయం పార్టీ నేతలు ఉత్సాహం పెరిగిందట.దీనికి తోడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా, అయోధ్యలో రామాలయం ప్రారంభం తదితర అంశాలు కలిసొచ్చే అవకాశం ఉందని, పార్టీ లీడర్లు భావిస్తున్నారట. దీంతో జహీరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్పరిధిలోని కామారెడ్డిలో బీజేపీ విజయం సాధించింది..అయితే తెలంగాణలో ఫలితాలు ఎలా ఉన్నా జహీరాబాద్ ఎంపీ స్థానం గెలుపు పై బీజేపీ నేతలు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటు న్నారట. ఈసారి జహీరాబాద్‌ నియోజకవర్గాన్ని తామే కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు నమ్ముతున్నారట.అయితే టికెట్ ఆశించేవారి సంఖ్యనే పెరుగుతుండటంతో పార్టీకి ఇబ్బందిగా ఉందట. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత ఆలే నరేంద్ర కొడుకు, ఆలే భాస్కర్, మాజీ ఎంపీ బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి, నిజామాబాద్ కి చెందిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి, బోధన్ కి చెందిన బీజేపీ నేత మెడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారట. అలాగే గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన బాణాల లక్ష్మా రెడ్డి ఈసారి జహీరాబాద్ నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారట. కాగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. సినీ నిర్మాత దిల్ రాజు కూడా ఇక్కడి నుండి బీజేపీ పార్టీ తరుపున పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.బీజేపీ పార్టీకి గతంలో కంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా లింగాయత్ సామాజిక వర్గం ఉండటంతో తమకే ఆ ఓట్లు వస్తాయని బీజేపీ పార్టీ నేతల నమ్మకమట. దీనికి తోడు మైనారిటీలు కూడా ఎక్కువగా ఉండటంతో వారి ఓట్లు చీలి బీజేపీ గెలుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. పైగా ఎవరి స్థాయిలో వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పైరవీలు చేసుకుంటున్నారట.మరో వైపు జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్‌చార్జిగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని నియమించింది. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గెలవడంతో, ఈయన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో, మండలాల్లో మీటింగ్లు నిర్వహిస్తూ, క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోటీకి ఆశావహుల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్ సభ స్థానం.. కర్ణాటక, మహారాష్ట్రకు బోర్డర్ లో ఉండటం కూడా కొంతమేరకు బీజేపీకి కలిసి వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇంత పోటీ ఉన్న ఈ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అదిష్టానం ఎవరిని ప్రకటిస్తుందో వేచి చూడాలి..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్