కొండపూర్లో దాదాపు రూ. 3600కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
36 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తోగించిన హైడ్రా
Hydra saved government land worth nearly Rs. 3600 crores in Kondapur
హైదరాబాద్, అక్టోబర్ 04:
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్లో దాదాపు రూ.3600 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉంది. ఆ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై హై కోర్టు తీర్పు మేరకు శనివారం ఆక్రమణల తొలగింపును హైడ్రా చేపట్టింది. అందులో తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించిన హైడ్రా. భారీ బందోబస్తు మధ్య అక్కడ షెడ్డులను తొలగించిన హైడ్రా. ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు.


