- స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం జరగనివ్వను
గాజువాక సభలో సీఎం జగన్
విశాఖపట్నం
సీఎం జగన్ మాట్లాడుతూ గాజువాక మరో మహా సముద్రం లా కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 59 నెలల్లో అనేక మార్పులు తెచ్చాము. జగన్ పేరు చెబితే ప్రజల కు అనేక పథకాలు గుర్తుకు వస్తాయి మీకు. 2 లక్షల 31 వేల ఉద్యోగులు ఇచ్చాము. మ్యాని పేస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం పూర్తి చేశాం. 14 ఏళ్ల ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఒక పథకమైన గుర్తుకు వస్తుందా మీకు.. ఉత్తరాంధ్ర ములపేట లో సీ పోర్టు వేగంగా తయారు అవుతుంది…మరో నాలుగు సీ పోర్టు కడుతున్నాము. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు న్యాయం చేశాము. మూడు వేల గ్రామంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశాము. ఉత్తరాంధ్ర లో 4 మెడికల్ కాలేజ్ లు వస్తున్నాయి.. దాదాపు నిర్మాణం దశ పూర్తి కూడా అయి ఉంది. 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాము.. అవి దాదాపు పూర్తి అయ్యా. భోగాపురం విమానాశ్రయం శరవేగంగా పరుగులు పెడుతుంది. చంద్రబాబు హయం ఇలాంటి అభివృద్ధి ఉందా.. ఉంటే ఒకటి చెప్పమని చెబుతున్నానిన అన్నారు.
అవ్వా తాతల కు పెన్షన్ నేరుగా ఇంటికి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ ను తెచ్చాను… దుర్మార్గపు తో చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి అవ్వా తాత లకు పెన్షన్లు ఇబ్బందులు పడేలా చేసాడు. మీ ఇంట్లో నా వాళ్ళ న్యాయం జరిగితే నాకు ఓటు వేయండి. మీ బిడ్డ రాష్ట్రన్నీ ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే.. ఇంత మంది కూటమి రాష్ట్ర అభివృద్ధికి వెనక్కి తీసులివెళ్లాడనికి నానా తంటాలు పడుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పేద వాడికి ఫ్యామిలీ డాక్టర్లు,ఆరోగ్య శ్రీ.. ఆరోగ్య ఆసరా కూడా ఇచ్చామని అన్నారు.
ఇది కదా అభివృద్ధి అని అడుగుతూ ఉన్న. నిన్న ప్రదాని మోదీ చేసిన విమర్శల చూస్తుంటే నాకు ఒకటే గుర్తుకు వచ్చింది. గత ఎన్నికల్లో దత్తపుత్రుడు.. మోదీ.. పోలవరం పై చంద్రబాబు పై అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూటమి చేరడంతో బాబు మంచి వాడు అయ్యాడు. జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పు కోలేదు గానుకే స్టీల్ ప్లాంట్ ప్రవేట్ కరణం చేయలేకపోయారు. ఇప్పుడు కూటమి అంతా ఒకటైంది ప్రత్యేక హోదా ఇస్తామని ఎక్కడైనా చెప్పారా. మీరు మళ్ళీ టిడిపి కూటమి గెలిస్తే మళ్ళీ స్టీల్ ప్లాంట్ అమ్మేసినట్లేనని అన్నారు. నేను అయితే స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం జరగనువ్వను.. గాజువాక ప్రజలకు హామీ ఇచ్చిన.రైల్వే జోన్ కి మనం ఎప్పుడో స్థలం కేటాయించి ఇచ్చాము..ఇచ్చిన స్థలంలో రైల్వే కార్యాలయం కట్టకుండా బీజేపీ డ్రామాలు ఆడుతున్నారు. గాజువాక లో టిడిపి గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకం తప్పదు..గాజువాక ప్రజలు అందరూ ఆలోచించండి.పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం గా మార్చుకున్నాడు అని చెప్పిన మోడీ, ఇప్పుడేమో చంద్రబాబు వల్లే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని చెప్పారు. గెలవడం కోసం ప్రధానమంత్రి కూడా అబద్దం చెప్పడం ఘోరం. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యమని మోడీ ఎందుకు చెప్పలేదు. ఇక రాష్ట్రానికి ఈ కూటమి వల్ల ఉపయోగం ఏమి వుంది. గాజువాకలో పొరపాటున కూటమి అభ్యర్థి గెలిసారంటే మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒప్పుకున్నట్లే.. గాజువాకలో కూటమి గెలిసిందంతే ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవరూ ఆపలేరని అన్నారు.