అన్య మతస్థుడు తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..

- Advertisement -

అన్య మతస్థుడు తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..

If a person of other religion wants to go to Tirupati, he has to follow the rules

పాప పరిహారార్ధం తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డిని స్వామివారు తిరుపతికి పిలిచారు
జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు   ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 26
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై     ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు   ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. క్రైస్తవుడు అయిన జగన్మోహన్ రెడ్డి మెట్లు ఎక్కి కాలినడకన తిరుపతి వెళుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనేది అందరికీ తెలిసిందే అని.. ఎవరైనా తిరపతి వెళ్లాలంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. మతపరంగా అన్య మతస్థుడు తిరుపతి వెళ్లాలంటే హిందూ మతం పట్ల అమితమైన విశ్వాసం ఉందని ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలన్నారు.పాపపరిహారార్థం జగన్మోహన్ రెడ్డి చెంపలు వేసుకుని తిరుపతి లడ్డూను వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో తిరుపతి లడ్డూను తినాలని అన్నారు. పాప పరిహారార్ధం తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డిని స్వామివారు తిరుపతికి పిలిచినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అందరితో కలిసి స్వీకరించామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి లడ్డూ స్వచ్ఛమైన నేతితో చాలా అద్భుతంగా తయారుచేశారని చెప్పారు. భక్తులు లడ్డూ ప్రసాదంపై ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల్లో ఎటువంటి దోషాలు జరగకుండా హిందూ మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular