గోమాతను రక్షిస్తే .. భూమాతను రక్షించుకోగలం

- Advertisement -
If we save cow, we can save mother earth
If we save cow, we can save mother earth

ఈనెల 6 నుంచి గో మహా పాదయాత్ర

ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభం

హైదరాబాద్:  సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి గో మహా పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు అఖిలభారత గో సేవా ఫౌండేషన్ మీడియా కోఆర్డినేటర్ రవి గుడాల తెలిపారు. పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను సోమాయిగూడ ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోమాతను రక్షించడం ద్వారానే భూమాతను రక్షించుకోగలమని అన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతోనే గో మహా పాదయాత్ర ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 25 రోజులపాటు 789 కిలోమీటర్లు కొనసాగుతుందని చెప్పారు. 100 మంది గోవింద మాల శివమాల లు ధరించి సాగే ఈ యాత్రను దత్త పీఠం స్వామి దత్త విజయానంద ప్రారంభిస్తారని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular