
పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన బిఆర్ఎస్ ప్రభుత్వం
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులను నమ్మితే మళ్ళీ మోసపోతాం
ఒక్కసారి అవకాశం ఇవ్వండి..
మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా
మంథని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని: బిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యిందని.కెసిఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని మంథని లో ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని మంథని నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి విమర్శించారు. బుధవారం మంథని మండలంలోని ఖాన్సాయి పేట, బట్టుపల్లి, అడవిసోమాన్ పల్లి,నాగేపల్లి, స్వర్ణపల్లి, వెంకటపూర్, మల్లారం, ఆరెంద గ్రామాలలో ఎన్నికలలో ప్రచారంలో మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో రైతుల పంట పొలాలకు,ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి.బిఆరెస్ ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారం,వరద బాధితులకు కూడా నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు.దళిత బందు,డబుల్ బెడ్ రూమ్,గృహ లక్ష్మి,నిరుద్యోగ భృతి,దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చేప్పి బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.,కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ నాయకులను నమ్మితే మళ్ళీ మోసపోతాం అన్నారు. మంథని ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు.ఒక్కసారి అవకాశం ఇస్తే మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని,అమెరికాను వదిలిపెట్టి 15 సంవత్సరాలుగా నేను మంథని ప్రాంత ప్రజల కోసం సేవ చేస్తున్నానని అన్నారు.బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా నన్ను గెలిపియాలని సునీల్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు,మహిళ నాయకురాలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



