Monday, March 24, 2025

వరి వేస్తే ఉరి కాదు.. సిరి

- Advertisement -

వరి వేస్తే ఉరి కాదు.. సిరి

If you throw rice, you will not be hanged.. Money

క్వింటాకు ₹500 బోనస్తో రైతుల్లో సంతోషం
మహబూబ్ నగర్
మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ సదస్సును మంత్రులు దామోదర రాజ నర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.  సదస్సులో భాగంగా వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను  మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి, మహబూబ్నగర్ ఇంచార్జ్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ రైతుల పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అధునిక సాగు పద్ధతులను నేర్చుకోవడానికి రైతులు చూపిస్తున్న ఆసక్తి చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోంది. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని చెప్పాం.  ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఆ మాటను ఆచరణలోకి తీసుకొచ్చాం. 11 నెలల కాలంలోనే 54,280 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేశాం. ఏకకాలంలో 22.5 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుపాయల రుణమాఫీ చేశాం. ఈ వానకాలం సీజన్లో సుమారు 67 లక్షల ఎకరాల్లో,  153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతాంగం పండించింది. పండిన ప్రతి గింజనూ కొనే బాధ్యత మా ప్రభుత్వానిది. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణకు 8 వేల కేంద్రాలను ప్రారంభించాం. ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది రైతుల నుంచి సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. రైతుల ఖాతాల్లో 5 వేల కోట్ల రూపాయలు జమ చేశామని అన్నారు.
వరి వేస్తే ఉరి అని గత ప్రభుత్వం రైతులను బెదిరించింది.వరి వేస్తే ఉరి కాదు.. సిరి అని మా ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మా ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతులకు, క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తోంది.వరి మాత్రమే కాదు, కందులు, శనగలు, జొన్నలు, సోయాబీన్ వంటి పంటలకు మద్ధతు ధర ప్రకటించి, కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.ఇప్పుడు వ్యవసాయమంతా యంత్రాల మీదే నడుస్తోంది.నాటు వేయడం దగ్గర్నుంచి కోత కోసే వరకూ ప్రతి పనికీ యంత్రాలు వచ్చాయి.ఇప్పుడిప్పుడే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది.భవిష్యత్తులో యాంత్రీకరణ ఇంకా పెరుగుతుంది.ఈ యంత్రాలు రైతులకు శారీరక శ్రమను తగ్గించడంతో పాటు, పెట్టుబడిని కూడా తగ్గిస్తున్నాయి.సాగుకు సాంకేతికతను జోడించి రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్