వనమాకు ఓటేస్తే కేసీఆర్ కి వేసినట్టే: ఎంపీ రవిచంద్ర

- Advertisement -

ఎంపీ వద్దిరాజు సమక్షంలో చేరికలు
Date 16/11/2023
—————————————-

If you vote for Vanama, it is like voting for KCR: MP Ravichandra

బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు ఓటేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓటేసినట్టేనని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.పొరపాటున వెంకట్రావుకు, సాంబశివరావుకు ఓట్లేసినట్టయితే వృధా అవుతుందన్నారు.కొత్తగూడెం కూలీలైన్ 23,27,33 డివిజన్లకు చెందిన సుమారు 1,000 యువకులు,మహిళలు కాంగ్రెస్ పార్టీని వీడి ఎంపీ రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఎడవల్లి నవీన్ ఆధ్వర్యంలో వేముల అశోక్,దాసరి రాజుల నాయకత్వాన గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంకట్రావుకు ఓటేసిన పక్షంలో ఆయన ఏ పార్టీలో చేరుతారో,ఎటు వెడతారో,ఇక కొత్తగూడెంకు వస్తారో,లేదో తెలియదని వ్యాఖ్యానించారు.సీపీఐ అభ్యర్థి సాంబశివరావు తన ఒక్కగానొక్క సీటు కోసం ఎంతో ఘనచరిత్ర కలిగిన పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టిన స్వార్థపరుడని ఎంపీ రవిచంద్ర విమర్శించారు.అదే బీఆర్ఎస్ అభ్యర్థి వనమాకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతానగర్, లక్ష్మీదేవిపల్లితో పాటు యావత్ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు జీడి సాయి,భూంపల్లి చంద్రశేఖర్,మామిడిపల్లి శివ, కత్తెర నరేందర్,ఎండీ రహీం,రేవంత్, మల్లికార్జున్,దిమ్మిడి శ్రీకాంత్,ఎస్కే సయీద్,రజని,ఉషా, జ్యోతి,సంధ్య,నాగమణి, సుజాత,శాంతి,సింధూజ,పద్మ,విజయ తదితరులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం రావు,ఎడవల్లి కృష్ణ,రావి రాంబాబు,వై.శ్రీనివాస్ రెడ్డి,చల్లా శకుంతల తదితరులు ప్రసంగించారు.బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవ, భీమా శ్రీధర్,చల్లా భాస్కర్,భూక్యా చందూనాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర, ఎడవల్లి కృష్ణ లకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు,”జై తెలంగాణ జై జై తెలంగాణ”,”వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీఆర్ఎస్ వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”,”వనమా వెంకటేశ్వరరావు కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలు హోరెత్తాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular