Monday, October 14, 2024

కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు- సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర

- Advertisement -

కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు- సీఎంఓలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర

Illegal case against Kadambari Jethwani - those two are the key players in CMO

విజయవాడ
ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు బనాయింపు, అరెస్టు, వేధింపుల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నాటి సీఎం కార్యాలయం (సీఎంఓ)లోని ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో ఒకరు సలహాదారు కాగా మరొకరు గత ఐదు సంవత్సారాల్లో సీఎంఓలో అన్నీ తానై వ్యవహరించిన ఐఏఎస్ అధికారి.
వీరి సమక్షంలోనే జనవరి 31న నాటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీలను సీఎంఓకు పిలిపించి మరీ జెత్వానీని అరెస్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతకంటే రెండు, మూడు రోజుల ముందే కుక్కల విద్యాసాగర్నూ సీఎంఓకు పిలిపించి మొత్తం వ్యూహాన్ని వివరించినట్లు నిర్ధారించారు. ఈ భేటీలు జరిగిన సమయంలో అందరి టవర్ లొకేషన్లు ఒకేచోట చూపించినట్లు సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు.

విశాల్ గున్నీ ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో కీలక విషయాల్ని విస్మరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాంతిరాణా, విశాల్ గున్నీలను, పీఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకు పిలిపించి జెత్వానీ వ్యవహారం అప్పగించారు. ఈ సమయంలో సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు ‘ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన వ్యవహారం. చాలా రహస్యంగా చేపట్టాలి. అందుకే మీకు అప్పగిస్తున్నాం. మీకేం కావాలో మేం చూసుకుంటాం’ అని స్పష్టంగా చెప్పటంతోనే తాము అందులో తలదూర్చాల్సి వచ్చిందంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ ఐపీఎస్ అధికారి తన సన్నిహితులతో చెబుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయణ్ని విచారిస్తే జనవరి 31న సీఎంఓలో ఏం జరిగింది? ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అసలు సూత్రధారులు ఎవరు వంటి కీలక విషయాలు బయటకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఆ ఇద్దర్నీ నిందితులుగా చేర్చే అవకాశం
ఇప్పటికే జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు, నాటి సీఎంఓలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ప్రమేయానికి సంబంధించి పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదుకు ప్రధాన ఆధారంగా చూపించిన డాక్యుమెంట్ ఫోర్జరీదని సకల శాఖల మంత్రి, పీఎస్ఆర్ ఆంజనేయులే దీని తయారీకి ఆదేశించినట్లు దర్యాప్తులో నిర్ధారించారు. విద్యాసాగర్, ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాదిని జనవరి 31 కంటే ముందే పలుమార్లు సీఎంఓకు పిలిపించి ఈ కుట్ర ప్రణాళిక గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వీటిపై మరింత లోతైన, శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత సకల శాఖల మంత్రిని, ఐఏఎస్ అధికారిని నిందితులుగా చేర్చాలని వారు భావిస్తున్నారు.
వారికి ముంబయి నుంచి భారీగా లబ్ధి: కాదంబరీ జెత్వానీ టాస్క్లో కీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు ముంబయిలోని పారిశ్రామికవేత్త సంబంధీకుల నుంచి భారీగా లబ్ధి పొందినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆమెపై కేసు నమోదుకు ముందు, జెత్వానీ అరెస్ట్ తర్వాత పలు దఫాలుగా వీరికి భారీ మొత్తాల్లో సొమ్ము అందిందని తెలుస్తోంది. విచారణాధికారులు ప్రస్తుతం ఆ మూలాల్ని ఛేదించే పనిలో ఉన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం లభిస్తే బాధ్యులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్