రైలు ప్రమాదాలు నివారణకు రాగల ఐదేళ్లలో కవచ్ విధానాన్ని అమలు

- Advertisement -

రైలు ప్రమాదాలు నివారణకు రాగల ఐదేళ్లలో కవచ్ విధానాన్ని అమలు
న్యూఢిల్లీ జూన్ 26
భవిష్యత్తులో రైలు ప్రమాదాలు నివారించడానికి భారతీయ రైల్వే 44000 కిమీ. రైలు ట్రాక్ లో కవచ్ విధానాన్ని అమలుచేయనున్నది. దీనిని రాగల ఐదేళ్లలో అమలుచేయనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు క్యాబినేట్ కార్యదర్శికి రాసింది.కవచ్ అనేది ఆటోమేటిక్ రక్షణ విధానం. ఇది రైళ్ల ప్రమాదాలను నివారిస్తుంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ఢిల్లీ-ముంబై, అలాగే ఢిల్లీ-హౌరా రూట్లలో కవచ్ విధానాన్ని అమలుచేయడానికి పూనుకున్నారు. ఈ ఏడాది చివరికల్లా అదనంగా 6000 కిమీ ట్రాక్ల  కోసం టెండర్లను జారీచేయనున్నారు.రైల్వే సురక్షణ కోసం మూడు కంపెనీలతో కలిసి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్ డిఎస్ఓ) ‘కవచ్’ను డిజైన్ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular