శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో నాకాబంది నిర్వహించిన పోలీసులు

- Advertisement -

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో నాకాబంది నిర్వహించిన పోలీసులు

In the wake of Srivari Brahmotsavam, the police conducted a blockade in Tirumala

కట్టుదిట్టమైన భద్రతా చర్యలలో భాగంగా బాలాజీ నగర్ లో క్షుణ్ణంగా తనిఖీలు
ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పరిశీలించి, సరైన గుర్తింపు కార్డులు లేని 15 మంది వ్యక్తులు బైండోవర్.. 32 వాహనాలు సీజ్.
తిరుమలలో నిషేధిత వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు.
తిరుమల
అక్టోబర్ 4వ తేదీ నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు తిరుమలలో పోలీస్ వారు తీసుకుంటున్న ముందస్తు పటిష్టమైన భద్రతా చర్యలలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున తిరుమలలో నాకాబంది నిర్వహించారు.
తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్, రెవెన్యూ, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, బీడీ టీం, డాగ్ స్క్వాడ్, సచివాలయ సిబ్బందిని సమన్వయపరచుకుంటూ పోలీసులు నాకాబంది సోధాలు నిర్వహించారు. స్థానిక బాలాజీ నగర్ లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి, అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పరిశీలించారు. అనవసరంగా తిరుమలలో నివాసం ఉంటున్న వ్యక్తులు మరియు సరైన గుర్తింపు కార్డులు లేని 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి, బైండోవర్ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 వాహనాలను సీజ్ చేసి, తిరుమల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుమలలో నిషేధిత వస్తువులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కట్టడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పి  రామకృష్ణ, డిఎస్పీలు విజయ శేఖర్ తిరుమల, సిఐలు విజయ్ కుమార్ తిరుమల వన్ టౌన్, మురళీమోహన్రావు తిరుమల టు టౌన్, హరి ప్రసాద్ తిరుమల ట్రాఫిక్, శేషగిరిరావు తిరుమల సిసిఎస్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular