- Advertisement -
మన్యం భూముల కౌలు వేలాలలో పెరిగిన ఆదాయం
Increased revenue from lease auctions of Manyam lands పోలీసుల పహారాలో ప్రశాంతంగా ముగిసిన వేలం పాటలు
రుద్రవరం
మండల పరిధిలోని పేరూరు గ్రామంలో శ్రీ ఈశ్వర స్వామి రామస్వామి ఆంజనేయస్వామి దేవస్థానం లకు చెందిన మన్యం భూములకు శుక్రవారం నిర్వహించిన కౌలు వేలలో దేవదాయ శాఖకు ఆదాయం పెరిగింది.
గ్రామంలోని శ్రీ ఈశ్వర స్వామి మరియు రామస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానం లకు సంబంధించి 75.68 ఎకరాల మన్యం భూములకు ఆలయ ఈవో నరసయ్య ఆధ్వర్యంలో దేవదాయ శాఖ అధికారులు కౌలు వేలాలు నిర్వహించారు. 75.68 ఎకరాల మన్యం భూములకు వేలాలు నిర్వహించగా 731000 రూపాయల ఆదాయం దేవాదాయ శాఖకు వచ్చిందని గత ఏడాది కంటే ఈ ఏడాది లక్ష 16 వేల రూపాయల ఆదాయం పెరిగిందని ఈవో నరసయ్య తెలిపారు. గత మూడు నెలల క్రితం జూన్ నెల 25వ తేదీన దేవాలయ మన్యం భూములకు వేలం పాటలు నిర్వహించేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రారంభించగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అప్పుడు వేలంపాటలు రద్దయ్యాయి. దీంతో శుక్రవారం కోవెలకుంట్ల సీఐ హనుమంతు, ఎస్ బి సి ఐ మోహన్ రెడ్డి, ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై హరిప్రసాద్, రుద్రవరం ఎస్ఐ వరప్రసాద్, పోలీసుల పహారాలో నిర్వహించిన వేలం పాటలు ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఈ వేలం పాటల నందు ఏఎస్ఐలు భూపాల్ రెడ్డి, శోభన్ బాబు పోలీసులు దేవదాయశాఖ అధికారులు సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
- Advertisement -




