దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలి

- Advertisement -

 దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలి
స్థానిక ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన లేఖలను ఎమ్మెల్యేలకు అందజేసిన పోస్టుల్ అధికారులు
 పత్తికొండ,డోన్ ఎమ్మెల్యేలకు లేఖలను అందజేసిన పోస్టల్ అధికారులు
తుగ్గలి/పత్తికొండ/డోన్

Independence Day celebrations should be celebrated across the country

దేశవ్యాప్తంగా ఆగస్టు 15న నిర్వహించే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని,స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని కోరుతూ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన లేఖలను పోస్టల్ అధికారులు బుధవారం రోజున ఎమ్మెల్యేలకు అందజేశారు.ఈ సందర్భంగా డోన్ సబ్ డివిజన్ పోస్టల్ అధికారి చంద్రమౌళీశ్వర రెడ్డి,తుగ్గలి పోస్ట్ మాస్టర్ భరత్ లు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు,డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కు లేఖలతో అటుగా త్రివర్ణ పతాకాన్ని అందించి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తమ వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసినట్లు పోస్టల్ అధికారులు తెలియజేశారు.అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడిన పోరాట యోధులను మననం చేసుకొని,ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశంలోని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని వారు తెలియజేశారు.ఇదే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పోస్టుల అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ,స్థానిక పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అప్పా వెంకటేశ్వర్లు,హర్షవర్ధన్ రెడ్డి,వినోద్,ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, పత్తికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular