బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు
🍥లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జని్మంచారు
🌀తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్ గతంలో బీబీసీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పనిచేశారు
💥బ్రిటన్ రాజు చార్లెస్-3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో గురువారం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సమీర్‌ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్ టీవీని ఈయన నడుపుతున్నారు