అజేయమైనది కమ్యూనిజం.. అజరామరమైనది సోషలిజం..
Invincible is Communism.. Immortal is Socialism..
దేవనకొండలో సిపిఐ శత జయంతి వేడుకలు
దేవనకొండ
పేద ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ, భూమికోసం భుక్తి కోసం,అణగారిన వర్గాల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించిన ఘన చరిత్ర కలిగిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం. నరసారావు లు తెలిపారు. గురువారం సిపిఐ శతజయంతి వేడుకలను దేవరకొండలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వంద జండాల తో ర్యాలీ నిర్వహిస్తూ, బాణాసంచా కాలుస్తూ,నినాదాలు చేస్తూ, బస్టాండ్ మీదుగా సిపిఐ కార్యాలనికి చేరుకొని అక్కడ పార్టీ అరుణ పతాకాన్ని సీపీఐ సీనియర్ నాయకులు కే. మద్దిలేటి శెట్టి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..1925 డిసెంబర్ 26 కాన్పూర్ లో ఆవిర్భవించిన సీపీఐ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సీపీఐ అని కొనియాడారు. దేశంలో వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, తర్వాత సీపీఐ మాత్రమేనని తెలిపారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని గుర్తుచేశారు.అనేకమంది నాయకులు, కార్యకర్తలు జైలుకెళ్లారని,కొందరు ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారని అన్నారు. ఆ పోరాటంలో పాల్గొన్న వారందరినీ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించారని తెలిపారు. సీపీఐ భూమి కోసం, భుక్తి ,పేద ప్రజల విముక్తి కోసం ఎన్నోపోరాటాలు చేసిందన్నారు.స్వాతంత్ర్యానంతరం కూడా సీపీఐ కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేసిందని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, త్యాగాలను నేటి తరం తెలుసుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు బజారి, నరసింహులు, ప్రసాదు, నాగేశ్వరరావు, కొండన్న, రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు కండప్ప,రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు, హరిచంద్ర, కృష్ణ, ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, రామాంజనేయులు, ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు మధు, భాస్కర్ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు విజయలక్ష్మి, శ్రీదేవి, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బడే సాహెబ్, రామ్ లక్ష్మణ్, హమాలి యూనియన్ నాయకులు నాగరాజు, మునిస్వామి ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.