4.1 C
New York
Thursday, February 22, 2024

బీసీలకు ఇచ్చేది భిక్ష కాదు.. మా వాటా

- Advertisement -

బీసీలకు తగిన వాటా ఇవ్వాల్సిందే

హైదరాబాద్, ఆగస్టు 23:  బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా అంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కామెంట్స్ సంచలనంగా మారాయి. ఖమ్మం అంటే విప్లవమని, అనుకరణ జిల్లా కాదు ఆదర్శవంతమైన జిల్లా అని అన్నారు. స్వతంత్రభావాలు గల జిల్లా ఖమ్మం జిల్లా అని తెలిపారు. బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 77 ఏళ్లుగా తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. అనేకపోరాటాలు చేస్తే కొంత మెరుగుపడిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1500 గురుకులాలు పోరాడి పెట్టించానని గుర్తు చేశారు. దళితులు, బీసీలు ముఖ్యమంత్రులున్నచోట కూడా ఇన్ని గురుకులాలు లేవని అన్నారు. 12 వేల ఉద్యమాలు చేసి, రెండు వేల పై చిలుకు జీవోలు తెచ్చినామని అన్నారు. బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు….మా వాటా…. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో బీసీల్లో పేదరికం లేదని అన్నారు. మన దేశంలో 48శాతం పేదరికం ఉందని, వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లే అని గుర్తు చేశారు.మనకు రాజ్యాధికారం వస్తే తప్ప ఈ పేదరికం పోదని అన్నారు. భవిష్యత్ యువకులదే…. కాబట్టి పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడితే పోయేదేమే లేదని అన్నారు. 21 మంది బీసీలకేనా సీట్లు, ఓసి లు 10 శాతం ఉంటే 65 శాతమా? అని ప్రశ్నించారు. సీట్లలో ఎంత అన్యాయం చేశారో నిన్ననే తెలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 77 ఏళ్ల తర్వాత కూడా దేశంలో పొరటాలా సిగ్గు సిగ్గు అని మండిపడ్డారు. నేను ఏ పార్టీ కాదని, జగన్ నా శ్రమ ను గుర్తించి రాజ్యసభ ఇచ్చాడని అన్నారు. నాకిచ్చిన పదవి బీసీ లకు అంకితం అన్నారు. పోరాటం ఆపేది లేదు….చీల్చి చెందాడుతా అని కీలక వ్యాఖ్యలు చేశారు. సుఖపడటానికి ఉద్యమం చేయట్లేదని, జాతికి విముక్తి కలిగించడం కోసం పోరాడుతున్నానని అన్నారు. రాజకీయాల్లో ఇంకా కులవివక్ష కొనసాగుతుందని, చదువుతోపాటు రాజకీయాలు చేయాలని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!