Thursday, February 12, 2026

వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

- Advertisement -

బహుజన బిడ్డ పుట్ట మధుకర్ కే మా మద్దతు
తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్

మంథని: వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, మంథని నియోజకవర్గంలో బహుజన బిడ్డ పుట్ట మధుకర్ కే మా మద్దతని తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి ధర్మేందర్, రాష్ట్ర సలహాదారులు బోనాల మల్లయ్యలు పేర్కొన్నారు. మంగళవారం మంథని పట్టణంలో ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి గెలవడం పక్క అని, ప్రజలకు అందుబాటులో ఉండే బహుజన బిడ్డ, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కే మా మద్దతు ఉంటుందని వారు ముక్తకంఠంతో పేర్కొన్నారు. సీఎం  కేసీఆర్ పైన మాకు నమ్మకం ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాకు సహకారాలు అందిస్తారని వారు తెలిపారు. మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న నాయకుడు కేవలం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అని వారు అన్నారు. బహుజన బిడ్డ పుట్ట మధుకర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన హయాంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందడం ఖాయమని వారు ధీమా చేశారు. నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి అభివృద్ధి తెలంగాణలో సదా సీఎం కేసీఆర్ కే మద్దతు ఇచ్చినట్లుగా వారు పేర్కొన్నారు.  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హయంలో  అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే మేము మద్దతిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర పరిశీలకులు నక్క శంకరయ్య రాష్ట్ర నాయకులు పెండ్లి నారాయణలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్