కౌశిక్ రెడ్డికి పాడె ఎక్కే సమయం వచ్చింది

- Advertisement -

కౌశిక్ రెడ్డికి పాడె ఎక్కే సమయం వచ్చింది

It's time for Kaushik Reddy to die

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (న్యూస్ పల్స్)
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆయనకు చెప్పు చూపించారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డిపై ఫైరయ్యారు. బండ్రో శోభారాణి మాట్లాడుతూ..‘తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉంది. మహిళలను అడ్డు పెట్టుకుని పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసిఆర్ కు పంపాలి. ఇతర పార్టీ నాయకుల చేరికతో టీఆర్ఎస్ పుట్టింది. కేసిఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకో. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టునికి మాట్లాడు. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి.. ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని ఆయనను విచారణకు పిలవాలి. ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా స్పీకర్ ను కోరుతున్నాం. ప్రభుత్వాన్ని పడగోడతాం మీరు అన్నారు.. కానీ, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలబెడుతామంటూ వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు’ అంటూ శోభారాణి మండిపడ్డారు.అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ.. ‘పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర నీది. బిడ్డ, భార్యను అడ్డుపెట్టుకొని చనిపోతాం అని ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచావు. పాడి కౌశిక్ రెడ్డి.. పతివ్రత.. శిరోమణి లీడర్ అన్నట్లు మాట్లాడుతున్నాడు. మహిళలను అగౌరవపరిస్తే చెప్పుదెబ్బలు పాలు అవుతారు. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే నిన్ను బయట తిరగనివ్వం’ అంటూ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular