జగన్ కు భయాన్ని చూపెట్టాలి: పవన్ కళ్యాణ్

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024ల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి.గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లో ఎండగడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ప్రచారంలో భాగంగా ఇరువురు అగ్రనేతలు పెడనలో జరుగుతున్న రోడ్ షోలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… సీఎం జగన్కు భయం చూపెట్టాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నన్ను భీమవరం నుంచి ఎందుకు మారారు అని జగన్ ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఎందుకు 75 మంది అభ్యర్థులను మార్చారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మత్స్యకారుల పొట్ట కొట్టారు. RTC, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ అక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే జరిగాయి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలీసుల శ్రమను కూడా దోచుకున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి.ఏ వర్గమూ సంతోషంగా లేదు’ అని ఆయనతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular