అవసరమైతే ఎన్డీయేకు జగన్ మద్దతు
విజయవాడ, ఏప్రిల్ 25,
ఎన్నికల తర్వాత కేంద్రంలో నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ కు బలం తగ్గితే మద్దతు ఇస్తామని నేరుగా వైసీపీ అధినేత జగన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమైనప్పడు ఎన్డీఏకు మెజార్టీ రాకపోతే తాను మద్దతు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా హామీ తీసుకుంటానని అన్నారు. ఎన్డీఏకు మెజార్టీ తగ్గుతుందా లేదా .. జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతు ఇచ్చేంత సీట్లు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే మద్దతు ఇస్తామన్న ఓ స్ట్రాటజీని మాత్రం బయట పెట్టారు. ఆయన ఆలోచనల్లో ఇండియా కూటమి లేదు. మూడో కూటమి అనే ఆలోచన లేదు. తటస్థం అన్న ఆలోచన కూడా లేదు. అవసరం అయితే ఎన్డీఏకే మద్దతు అని చెప్పారని అనుకోవచ్చు. వైసీపీ కీలక నేత, మంత్రి అంబటి రాంబబాు కూడా ఓ టీవీ చానల్ చర్చలో అదే మాట్లాడారు. అంటే వైసీపీలో ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏకే మద్దతు అన్న ఓ స్ట్రాటజిక్ నిర్ణయం అని అర్థమవుతుంది. అదే కూటమిలో తాను పోరాడుతున్న టీడీపీ, జనేసన ఉన్నప్పటికీ జగన్ మద్దతివ్వాలని ఎందుకు అనుకుంటున్నారు ?2014 నుంచి వైఎస్ఆర్‌సీపీ తన విధానాన్ని బీజేపీకి దగ్గరగానే ఉంచుకుంది. ఎప్పుడూ ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. 2014లో కూడా ఇప్పుడు కూటమి కట్టినట్లే అప్పుడు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూడా కూటమి కట్టాయి. విజయం సాధింాచయి. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ.. పవన్ కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు జనేసన పార్టీ కూడా బరిలో ఉంది. వైఎస్ఆర్‌సీపీపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. 2014లో అప్పట్లో వైసీపీ ఎలాంటి అధికారం అనుభవించలేదు. అందుకే ఆ పార్టీపై ఇప్పుడు చూపిస్తున్నంత వ్యతిరేకత చూపించలేదు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో .. వైఎస్ఆర్‌సీపీ కూడా బీజేపీతో సన్నిహితంగా ఉంది. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డితో బీజేపీ పెద్దలు సన్నిహిత సంబందాలు నెరపుతున్నారన్న ఉద్దేశంతోనే టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చిందన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. కానీ వైఎస్ఆర్‌సీపీ కూటమిలో చేరే రాజకీయ పరిస్థితులు లేవు. గత ఎన్నికల సమయంలో విడివిిగా పోటీ చేసిన పార్టీలు.. ఇప్పుడు కలిస పోయాయి. విడివిడిగా పోటీ చేసినప్పుడు బీజేపీ.. వైఎస్ఆర్‌సీపీకి సహకరించిందన్న అభిప్రాయాలు గట్టిగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నా కేంద్రంలో మాత్రం వైఎస్ఆర్‌సీపీ .. బీజేపీకి నేరుగా సహకరించింది. బీజేపీకి లోక్ సభలో తిరుగులేని మెజార్టీ ఉన్నా రాజ్యసభలో మాత్రం మెజార్టీ లేదు. వైఎస్ఆర్‌సీపీ సభ్యుల మద్దతుతోనే దాదాపుగా ప్రతి కీలకమన బిల్లును నెగ్గించుకున్నారు. బీజేపీ అడగాల్సిన అవసరం కూడా రాలేదు. వైఎస్ఆర్‌సీపీ మద్దతుగా ఎప్పుడూ రెడీగానే ఉంది. వివాదాస్పదమైన సీఏఏ, రైతు చట్టాలకు కూడా మద్దతు తెలిపారు. అయితే ఖచ్చితంగా వైసీపీ ఎంపీల మద్దతు అవసరం అయినప్పుడు రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేకహోదా ఇతర అంశాలపై డిమాండ్ చేయలేదన్న విమర్శలు వైఎస్ జగన్ పై ఉన్నాయి. లోక్ సభ ఎంపీల గురించే ఆయన చెబుతున్నారు కానీ రాజ్యసభ ఎంపీల లోటు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం డిమాండ్ చేయలేదని.. దానికి కారణం బీజేపీతో ఆయన విబేధించే పరిస్థితి లేకపోవడమని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసింది. అయినా బీజేపీపై పల్లెత్తు మాట అనడం లేదు సీఎం జగన్. పైగా ఢిల్లీలో బీజేపీకే మద్దతిస్తామన్న సంకేతాలు పంపుతున్నారు. తమ పార్టీని ఓడించడానికి కూటమిగా ఏర్పడిన పార్టీని విమర్శించుకుండా తర్వాత తాను మద్దతుగా ఉంటానని చెప్పడం వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీలో ఏదో లోపం ఉన్న అభిప్రాయానికి వచ్చేలా చేస్తోంది. రేపు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అందులో టీడీపీ, జనసేన భాగంగా ఉంటాయి. ఆ సమయంలో తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండటానికే బీజేపీతో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిపై పలు రకాల కేసులు ఉన్నాయి. ఆ కేసుల భయంతోనే ఆయన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా ఉపయోగిస్తున్నారని.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఎన్డీఏకే మద్దతు అనే ప్రచారం బీజేపీ .. పొత్తులు పెట్టుకోక ముందు ఉంది. అంటే వైసీపీ ఎంపీ సీట్లు గెలిచినా.. టీడీపీ ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీకే మద్దతిస్తాయని అర్థం. అయితే అది బీజేపీ ఓ ఓ పార్టీ కూటమిలో చేరక మందు. ఇప్పుడు టీడీపీ, జనసేన , బీజేపీ ఓ కూటమిగా ఏర్పడ్డాయి. మరి వైసీపీ వ్యతిరేకమవ్వాలి. కానీ కాలేమని చెబుతోంది.అంటే.. ప్రజలు కూడా అలా అయితే ఎన్డీఏ కూటమికే ఓటు వేయవచ్చు కదా అనే ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదం ఉన్నా జగన్ తాను ఎన్డీఏ కూటమి వైపే ఉంటానని సంకేతాలు పంపుతున్నారు. ఇది రాజకీయంగా వైఎస్ఆర్‌సీపీకి మేలు చేస్తుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతుంది.
అవసరమైతే ఎన్డీయేకు జగన్ మద్దతు
- Advertisement -
- Advertisement -