- Advertisement -
కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తిరుమల చేరుకున్న జాన్వీ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. జాన్వీకపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -



