Sunday, September 8, 2024

ప్రజల కోసం పోరాడేతత్వం జస్టిస్ పుంజాల శివ శంకర్ జయంతోత్సవం

- Advertisement -

రిజర్వేషన్ల పితామహుడు జస్టిస్ పుంజాల శివ శంకర్ 94వ జయంతి ని ఘనంగా జరిపిన శివ శంకర్ ఫౌండేషన్

 

Jayantotsavam of Justice Punjala Shiv Shankar who fought for the people
Jayantotsavam of Justice Punjala Shiv Shankar who fought for the people

తార్నాక, ఓయూ క్యాంపస్: ఆగస్టు10 (వాయిస్ టుడే ప్రతినిధి): రిజర్వేషన్ల పితామహుడు జస్టిస్ పుంజాల శివశంకర్  ప్రజల కోసం పోరాడే తత్వం, అన్యాయాన్ని అక్రమాలను ధిక్కరించే నైజం ఉన్న నాయకులు భారత సామజిక న్యాయ శిఖరం, రిజర్వేషన్ల పితామహుడు పుంజాల శివశంకర్. నేడు 94వ జయంతి సందర్బంగా మాణిక్యశ్వర్ నగర్ లోని పి.శివశంకర్ పౌండేషన్ కార్యాలయం లో పుంజాల శివ శంకర్ 94వ జయంతి కార్యక్రమం జరిగింది.   శివశంకర్   ఏవిదంగా జీవించాలో తెలిసిన మనిషి, మరణానికి కూడా ఒక అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చిన మహా మనిషి మన శివశంకర్ కు ఘనమైన నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్, డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్, ఇనుముల రాజు, ఆకుల మల్లేష్, శ్రీనివాస్, రవీందర్, వెంకటేశం, ఎం ఎన్ రావు మొదలైన వారు పాలుగోన్నారు. శివశంకర్ జీవితం గురించి  పర్వతం వెంకటేశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 30 యేళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 1977-78లో బి సి లకు రిజర్వేషన్ అమలు పర్చడానికి కృషి చేసిన ఘనత  పుంజాల శివశంకర్   కు దక్కుతుందని 1970 లో బి సి హక్కుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి,తానే సుప్రీం కోర్ట్ లో కేసు వాదించి ఎనిమిది నెలలు అక్కడనే ఉండి అణగారిన వారి హక్కులను కాపాడి రిజర్వేషన్ సంపాదించాడు. కేద్రమంత్రిగా 18 సవంత్సరాలు పనిచేశారు. అందుకే తెలుగు రాష్ట్రాల బహుజనులకు రిజర్వేషన్ల పితామహుడు అయ్యారని అయన సేవ ను కొనియాడారు. సభను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ

ఆత్మవిశ్వాసం,క్రమశిక్షణ దృఢ సంకల్పం,దూర ద్రుష్టి  ఉంటె పేద కుటుంబంలో పుట్టిన అత్యున్నత శిఖరాలకు అందుకోవచ్చని నిరూపించిన ఆదర్శ మూర్తి జస్టిస్ పుంజాల శివశంకర్ అని కొనియాడారు. నేటి బహుజన యువత శివశంకర్ గారిని ఆదర్శనంగా తీసుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు. తన న్యాయ విద్యను 23 సంవత్సరాలకే పూర్తి చేసి న్యాయ వాది గా పనిచేసి  హైకోర్టు న్యాయమూర్తి గా పని చేశారంటే అతని గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు.  న్యాయమూర్తి పదవికి పదకొండు నెలల్లోనే రాజీనామా చేసారంటే  అతని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలని కొనియాడారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నలుగురు న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తిలు గా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర పతికి సిపారసు  చేసింది. అందులో మొదటి పేరు శివశంకర్ దే గాని  ప్రమాణ స్వీకార సమయంలో శివశంకర్ శివశంకర్ పేరుగా మారిపోయింది అడిషనల్ జడ్జిగా నియమించారు దీనికి శివశంకర్ న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒప్పుకోలేదు.ప్రభుత్వం ప్రమాణ స్వీకారాము రెండు రోజులు వాయిదా వేసింది దీని వెనుక రెడ్డి లాబీయింగ్ జరిగిందని అవమానకరంగా భావించి పదకొండు నెలలకె   న్యాయ మూర్తి కి రాజీనామా చేశారు ఈ విషయాన్నీ తాను న్యాయ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు రాష్ట్ర పతి భవన్ నుండి ఆ పైలు తెప్పించి, రెడ్డిల కుట్ర ను ఇందిరా గాంధీ ద్రుష్టి కి తీసుకెళ్లాడు. అతని కమిట్మెంట్ దూర దృష్టి ఉన్నతమైనది అని మెచ్చుకున్నాడు.

పుంజాల శివశంకర్ ఉన్నత చదువుల కోసం చెప్పులు కుట్టి పల్లీలు అమ్మి అమృత్ సర్  లో న్యాయ విద్యను పూర్తి చేశారంటే అతని సామజిక స్పృహ ఎంత ఉందొ అర్ధం అవుతుంది ఇతని జీవిత చరిత్రను ఇంగ్లీష్ లో వ్రాస్తే అంతర్జాతీయ గుర్తింపు వచ్చేది అయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపు గా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలనీ అతని కుటుంబ సభ్యులను కోరారు. దీని ద్వారా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య అందించాలని సూచించారు పర్వతం వెంకటేశ్వర్  రాసిన శివ శంకర్ బుక్ ను చూశాను అతన్ని ప్రోచాహించమని  వినయ్ కుమార్ కోరారు కానీ ఇప్పటివరకు 50 పేజీలపుంజాల శివశంకర్  గ్రంధం ప్రింటింగ్ కు నోచుకోలేదు.ఎవరైనా ముందుకు వస్తే ఆ గ్రంధం ప్రచురిస్తాం. డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ మాట్లాడుతూ శివ శంకర్ గారి జీవిత కాలం మొత్తం దళిత బహుజనుల కు సేవ చేశారని అన్నారు సుప్రీం కోర్ట్, హై కోర్ట్ లో దళిత న్యాయ వాదులను న్యాయ మూర్తులను చేయారు వారిలో జస్టిస్ బాలకృష్ణన్,జస్టిస్  రామ స్వామి మొదలైనవారు ఉన్నారు 2018 లోనే శివశంకర్ మెమోరియల్ ట్రస్ట్ ను జస్టిస్ బాలకృష్ణన్ ప్రారంభిస్తారని చెప్పారు కానీ ఇప్పటికి  ఏర్పాటు చేయలేదు. ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో కేద్రమంత్రిగా 18 సవంత్సరాలు కీలక రెండు మూడు శాఖలకు స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించారంటే అతని సమర్థతను  కొనియాడ వలిసిందే  ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్న తాను బి సి బిడ్డ నని  మర్చి పోకుండా అగ్ర కుల ముఖ్య మంత్రులను కాదని  బి సి రిజర్వేషన్ల ను సాధించి చరిత్రలో నిలిచి పోయారు. మున్నూరు కాపు మహా సభ నిర్మాణం కోసం బొజ్జమ్ నర్సింలు తో కలిసి ట్రస్ట్ కు కృషి చేశారు.  మ్యడం జనార్దన్ రావు ను  ట్రస్ట్ భవన్ కు పరిచయం చేసింది పుంజాల శివశంకర్.కాబట్టి మన మంత  అతన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత మనమీద ఎంతయినా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్