- Advertisement -
డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని జేడీ డిమాండ్
విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ రవాణా చాలా తీవ్రమైన విషయమని జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ట్విట్టర్ వేదికగా.. డ్రగ్స్ మాఫియా ద్వారా రాష్ట్రంలోని యువత ఏ విధంగా టార్గెట్ అవుతోందనే విషయాన్ని ఇది స్పష్టంగా తెలియజేస్తోందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిందితులు, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -