- Advertisement -
వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులుగా జిట్టా నాగేష్ యాదవ్ ఎన్నిక
Jitta Nagesh Yadav elected as YSRCP District Vice President
తుగ్గలి
తుగ్గలి మండలం పరిధిలోని గల గుత్తి ఎర్రగుడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జిట్టా నాగేష్ యాదవ్ కు జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్ష పదవి అప్పగిస్తూ వైఎస్ఆర్సిపి కేంద్ర కమిటీ మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షునిగా ఎన్నికైన జిట్టా నాగేష్ యాదవ్ మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కు, పదవి రావడానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి కు,మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు,మండల వైఎస్ఆర్సిపి నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే క్రమశిక్షణతో వైసిపి పార్టీ అభివృద్ధికి మరింత బాధ్యతతో పనిచేసి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో,సార్వత్రిక ఎన్నికలలో వైసిపి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్ తెలియజేశారు.
- Advertisement -