Wednesday, April 1, 2026

జర్నలిస్టులు పోరాడి హక్కులను సాధించుకోవాలి -టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

- Advertisement -
జర్నలిస్టులు పోరాడి హక్కులను సాధించుకోవాలి
-టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య
వేములవాడ,ఏప్రిల్ 01:వాయిస్ టుడే
Journalists Must Fight to Secure Their Rights
— TWJF State Convener Mamidi Somayya

Journalists Must Fight to Secure Their Rights— TWJF State Convener Mamidi Somayya
Journalists Must Fight to Secure Their Rights
— TWJF State Convener Mamidi Somayya
జర్నలిస్టులు తమ హక్కులను సాధించుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వ్యవ స్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మున్నూరుకాపు భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా జర్నలిస్టులకు కనీసం అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విరోచిత పాత్ర పోషించిన జర్నలిస్టులను గత ప్రభుత్వం విస్మరించిందని, ఈ ప్రభుత్వం కూడా రెండేళ్లుగా సమస్యలు పరిష్కరించకుండా తీవ్ర వివక్ష చూపుతుందని అన్నారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జర్నలిస్టులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండ్లు ఇండ్లస్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్ వంటి డిమాండ్ల సాధనకై జర్నలిస్టులు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ కుడితాడు బాపురావు మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కులు, సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. జిల్లాలో ఫెడరేషన్ ను బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెరుక రవి అధ్యక్షత వహించగా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, వేములవాడ కన్వీనర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
*వేములవాడ కమిటీ ఎన్నిక*
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) వేములవాడ నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష పదవికి కొప్పుల ప్రసాద్, బొప్ప బిక్షపతి పోటీ పడగా జరిగిన రహస్య బ్యాలెట్ ఓటింగ్ లో అధ్యక్షునిగా బొప్ప బిక్షపతి (ప్రజా జ్యోతి) గెలుపొందారు.
కార్యదర్శిగా గొల్లపల్లి వేణు (ఇంద్రప్రభ), ఉపాధ్యక్షులుగా కవ్వాల సురేందర్, కోశాధికారిగా సాహెద్ పాషా, జాయింట్ సెక్రెటరీలుగా ఏం సంజీవ్, చింతల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా నడిగట్ల మధు, చక్రహరి దేవేందర్ రాజ, నడికట్ల బిక్షపతి, బోడ్ల భరత్ బాబు, కొమురవెల్లి మునిష్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులను, ఎన్నికైన వేములవాడ కమిటీ నాయకులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్