కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాలు
రెండవరోజు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు
హైదరాబాద్
కాలేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కార్యాలయాల్లో రెండవ రోజు విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగాయి.మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు మొదలైన సంగతి తెలిసిందే.మేడిగడ్డ బ్యారేజి ,కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ ఎస్పి రమేష్ ఆధ్వర్యంలో 10 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు.
ఈ దాడులు మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహించి పలు కీలకమైన రికార్డులను స్వాధీనపరచుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లికి పంప్ హౌస్ కు సంబంధించిన కీలకమైన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కన్నెపల్లి పంప్ హౌస్ ను సీజ్ చేసారు. మాహదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో పోలీస్ సెక్యూరిటీ మధ్య విజిలెన్స్ అధికారులు కీలకమైన ఫైల్స్ భద్రపరిచారు. అర్ధరాత్రి అనంతరం మేడిగడ్డ వద్ద ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో అధికారులు బస చేసారు. బుధవారం తెల్లవారుజామున మహాదేవపూర్ డివిజన్ కార్యాలయానికి వచ్చి తనిఖీలను ముమ్మరం చేసారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాలు రెండవరోజు కొనసాగుతున్న విజిలెన్స్ తనిఖీలు
- Advertisement -
- Advertisement -