Sunday, December 22, 2024

గేమ్ ఛేంజర్ గా  కాళేశ్వరం అవినీతి

- Advertisement -

గేమ్ ఛేంజర్ గా  కాళేశ్వరం అవినీతి
కరీంనగర్, జనవరి 5,
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఇప్పుడు  గేమ్ చేంజర్‌గా మారుతోంది. జ్యూడీషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. గతంలో సీబీఐ విచారణ అడిగారు కదా ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారంలో జ్యూడీషియల్ విచారణ ప్రారంభిస్తామని చెబుతున్నారు. గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూ మిలోకి కుంగిపోయిన ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. కాళేశ్వరం లో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై నిగ్గు తేల్చేందుకు న్యాయవిచారణ జరిపిస్తామని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా నిండు సభలోనే ప్రకటించారు. దోషులు ఎంతటివారైనా సరే ఎవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే చెబుతోంది.  ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాల్ససి ఉంటే..  ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారింది.  ప్లాన్ మార్చేసి.. ప్రాజెక్టు లొకేషన్ బీఆర్ఎస్ మార్చిందని ..  35 వేల కోట్ల తో   కట్టాలనుకున్న ప్రాజెక్టు . కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు ఖర్చు పెరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.  కాళేశ్వరం ప్రారంభం నుంచి   అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ చెబుతోంది. మేడిగడ్డ కుంగిపోవడంతో అవినీతిపై మరింత ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన  మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో 67 వేల 406 కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని తేల్చారు.  ఈ ప్రాజెక్ట్ ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందని..  ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్ రేటు కంటె 12 శాతం ఎక్కువ వడ్డీ ప్రజలు కట్టాల్సి వస్తోందన్నారు.   ఒక్కో ఎకరానికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వడానికి రూ. 46 వేల ఖర్చు అవుతుంది. ఒక్కో యూనిట్ కరెంటుకు రూ. 6.40 బిల్లింగ్ జరిగితే దాన్ని గత ప్రభుత్వం రూ. 3గా చూపెట్టింది. ఐదేండ్లలో కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ అయిన నీరెంత?.. తిరిగి సముద్రంలోకి చేరిందెంత? మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో 50 టీఎంసీలు నిల్వ చేస్తున్నా అక్కడ భూకంప తీవ్రతపై స్టడీ జరిగిందా? బాహుబలి పంపుల కొనుగోలులో జరిగిన గోల్‌మాల్ ఏంటి? మంథని, చెన్నూరు ప్రాంతాల్లో ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లింపు సంగతేంది? అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న.వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే పంప్‌సెట్లను స్థానికంగా అసెంబుల్‌ చేయించి, నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పున వసూలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఆరోపించారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ గత ఏడాది వచ్చిన గోదావరి వరదలకు మునుగిపోయి, మొత్తం 17 మోటార్లు దెబ్బతిని, ఇందులో ఆరు మోటార్లు పూర్తిగా నాశనం కాగా… వీటి మరమ్మతుకు కావాల్సిన 12 వందల కోట్ల రూపాయల ఖర్చును ఈ పంప్‌హౌస్‌ నిర్మించిన కాంట్రాక్టరే భరిస్తారని, ‘డిఫెక్ట్‌ లయబిలిటీ’లో భాగంగా, ఈ బాధ్యత కాంట్రాక్టర్‌దేనని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనకు విరుద్ధంగా, పంప్‌హౌస్‌ రిపేర్‌ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్‌ దరఖాస్తు చేశారని, ఇది పెండింగ్‌లో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సముద్ర మట్టానికి 126 మీటర్ల ఎగువన పంప్‌హౌస్‌ నిర్మించాల్సివుండగా, 110 మీటర్ల ఎగువన మాత్రమే పంప్‌హౌస్‌ నిర్మించారని కూడా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. అంటే… దాదాపు 50 అడుగుల తక్కువ ఎత్తులో పంప్‌హౌస్‌ నిర్మించారు.  కాళేశ్వరంపై న్యాయవిచారణ జరిపించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులు అందరికీ ఈ విషయంపై మంచి “పట్టు” ఉండటమే కాక, ఈ వ్యవహారంలో నిజం నిగ్గు తేల్చాలన్న పట్టుదల కూడా ఉంది. దీనికితోడు, ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కూడా పెండింగ్‌లో ఉంది.  బీజేపీ కూడా మొదటి నుంచి కాళేశ్వరం అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ నేరుగా సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో డిమాండ్ చేసినట్లుగా సీబీఐకి సిఫారసు చేయాలని..  రెండు రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇదంతా బీజేపీ – బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ లో భాగమని నమ్ముతోంది.సీబీఐ చేతికి ఇస్తే.. ఇతర కేసుల్లాగే రాజకీయ అవసరాలకు వాడుకుని బీఆర్ఎస్ నేతల్ని గుప్పిట్లో పెట్టుకుని కేసును పక్కన పెట్టేస్తారని .. కాళేశ్వరం  బడా కాంట్రాక్టర్ బీజేపీకి కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంట్రాక్టర్ ను తప్పించడానికే కేసు విచారణ తమ చేతికి రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ.. కాళేశ్వరంలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో తమకు పూర్తి సమాచారం ఉందని.. జ్యూడిషియల్ విచారణతో మొత్తం ప్రజల ముందు పెడతామని అంటున్నారు.మొత్తంగా రెండు  పార్టీలు కాళేశ్వరంపై విచారణకు పోటీ పడుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు.. ఎవరు నిజాల్ని బయటపెడతారన్నది సస్పెన్స్ గా మారింది. ఇవన్నీ రాజకీయ ఆటలేనని రూపాయి కూడా అవినీతి బయటకురాదని నమ్మేవాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్