- Advertisement -
కనుల పండగ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం…..
Kanula Festival Vishwakarma Jayanti Yajna Mahotsava.....
నాగర్ కర్నూల్ లో విశ్వకర్మ యాగాదోత్సవాలు కనుల పండగ జరిగాయి .అక్కడ నిర్మించిన వీరబ్రహ్మేంద్రస్వామి గుడిలో ఉత్సవాలు యాగాది క్రతువులు నిర్విఘ్నంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పాండు చారి ఆధ్వర్యంలో కొనసాగాయి. ప్రధానంగా ప్రపంచానికి ఆద్యుడు మూలపురుషులైన విశ్వకర్మను ప్రతి ఒక్కరు స్మరించుకోవలసిన అవసరం ఉందని ఆ సమావేశానికి హాజరైన విశ్వబ్రాహ్మణులు తెలిపారు. యజ్ఞ మహోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ మెంబర్ మల్లు రవి మరియు శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి వందల మంది విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ యాగాది క్రతువులు నిర్విఘ్నంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఎంపీ రవి మాట్లాడుతూ విశ్వకర్మ ప్రపంచానికి ఆయన నిర్మాణాలే ఈనాటి ఇంజనీర్లకు మార్గదర్శకమని అలాగే నేటి ఇంజనీర్లకు విశ్వకర్మ దిక్సూచి లాంటివాడని ఆయన సేవలను మల్లు రవి కొనియాడారు. విశ్వబ్రాహ్మణ వంశలో జన్మించిన మూలపురుషుడైన విశ్వకర్మతో పాటు వీరబ్రహ్మేంద్రస్వామి కూడా జగద్విఖ్యాతి పొందిన మూలపురుషులుగా వారి సేవలను మల్లు రవి కొనియాడారు. అనంతరం శాసనసభ్యులు రాజేష్ రెడ్డి మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే ప్రతి విశ్వబ్రాహ్మణులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. ప్రధానంగా నేడు విశ్వకర్మ మహోత్సవాలకు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అన్నారు .ఏది ఏమైనప్పటికీ కొన్ని యుగాలకు ముందే కాలజ్ఞానం చెప్పిన జగద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వంశస్తులైన మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అన్ని రకాల వృత్తుల్లో కొనసాగుతున్న విశ్వబ్రాహ్మణులు అభివృద్ధి చెందాలని ఆర్థిక పురోగతి సాధించాలన్న దే తమ ఆకాంక్షగా తెలిపారు .ఈ కార్యక్రమంలో కన్నుల పండుగగా కొనసాగిన కోలాట కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణ మహిళలు నిర్వహించడం అభివృద్ధి అభినందించదగ్గ విషయమని అన్నారు. కొద్దిరోజుల్లోనే తమకు కోలాటం నేర్పిన తమ గురువులైన చందు శ్రావణి లకు కోలాటం నేర్చుకున్న విశ్వ బ్రాహ్మణ మహిళలు గురువులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం పట్టణంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు .ఈ కార్యక్రమం ఆలయ అభివృద్ధి కమిటీ పాండు చారి ఆధ్వర్యంలో కొనసాగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా కేశవాచారి దామోదర్ .కృష్ణకాంత్ ధర్మాచారి. విష్ణు చారి. కే దక్షిణామూర్తి. పి రజిత మూర్తి. రామాచారి .నాగోజు శ్యాం కుమార్ .అరవింద. గన్నోజ్ ప్రతాప్ .కొండూరు రవి .అశోక్ లాంటి పలువురు ముఖ్యులతోపాటు వందలాది మంది విశ్వబ్రాహ్మణులు హాజరై కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు .ఇవే కాదు వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవాలు మరియు కళ్యాణము లాంటి కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో ప్రముఖంగా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. మన విశ్వబ్రాహ్మణులంతా ఏకతాటిపై నడిచి శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధికి సహకరించాలని వారంతా పిలుపునిచ్చారు .ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమానికి ప్రధానాకర్షణగా విశ్వబ్రాహ్మణ మహిళల కోలాటం నిలిచిపోయింది అని పట్టణ ప్రజలు చెప్పుకుంటున్నారు
- Advertisement -