కర్ణాటక to హైదరాబాద్ – వాల్మీకి కార్పొరేషన్ స్కాం
Karnataka to Hyderabad - Valmiki Corporation Scam
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలోని వాల్మీకి కార్పొరేషన్‌లో వెలుగులోకి వచ్చిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికలకి ముందు ఈ డబ్బులు తెలంగాణకు చేరాయని, ఎన్నికల్లో వీటిని వినియోగించినట్టు అనుమానాలు ఉన్నాయి . ఈ దిశగా విచారణ చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. అసలు, ఈ స్కామ్‌తో సంబంధమున్న తెలంగాణకు చెందిన వారిని ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారనేది అంతుచిక్కని ప్రశ్న మరిన్ని వివరలోకి వెళ్తే……. ఈ స్కామ్‌లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్‌కు తరలిరావడం, అందులో ఒక్క ఆర్బీఎల్ బ్యాంకులోని 9 ఖాతాల్లోనే ఆ డబ్బు జమ కావడంతో అందర్నీ ఆశ్చర్యనికి గురి చేస్తుంది. స్కాం సంబంధించి కొన్ని కీ పాయింట్లు……. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ విచారణలో రోజుకో కొత్త మలుపు. ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 ఖాతాల్లో 45 కోట్లు జమ. స్కామ్‌కు సంబంధించి రాష్ట్రంలో సిట్, సీబీఐ, ఈడీ సోదాలు. సూసైడ్‌తో స్కామ్ గుట్టురట్టు చేసిన సూపరింటెండెంట్‌పై కేసు. అతడే కీలక నిందితుడు అని పేర్కొంటూ సిట్ రెండో చార్జిషీట్. తన భర్తను కావాలనే ఇరికిస్తున్నారన్న మృతుడి భార్య కవిత. సోదాల తర్వాత ఎలాంటి ప్రకటన విడుదల చేయని కేంద్ర ఏజెన్సీలు. అనుమానాలు ఉన్నా లోతైనా విచారణ జరపని దర్యాప్తు సంస్థలు. నిందితులను తప్పించి బాధితులే లక్ష్యంగా సిట్ విచారణ. అదే చార్జిషీట్‌లో ఎక్కడా కనిపించని ప్రధాన నిందితుల పేర్లు. నకిలీ ఖాతాలు…… డబ్బు జమ అయిన 9 ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాలు నకిలీవే , కేవలం స్కామ్ డబ్బులు తరలించడానికే వీటిని తాత్కాలికంగా వినియోగించుకునట్లు ఈడీ స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం ఈ యెుక్క బ్యాంకు అకౌంట్‌లు క్రియాశీలంగా లేవని వెల్లడించింది. వాల్మీకి కార్పొరేషన్ సంబంధించిన నిధులు పక్కదారి పట్టాయన్న వషయం వాస్తవమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్టు అర్థమవుతుంది అని పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈడీ, సీబీఐ, సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఈ సోదాల్లో ఏం లభించాయన్న విషయంపై మాత్రం కేంద్ర ఏజెన్సీలు ఎలాంటి ప్రకటన చేయకపోవడం కొసమెరుపు.