Thursday, March 12, 2026

కవిత…గోవర్థనా…

- Advertisement -
ED forward Kavitha: Attending?
Kavitha…Govarthana…

నిజామాబాద్, జనవరి 26,
నిజామాబాద్ జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను పోటీలో పెట్టి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్‌ను కట్టడి చేయాలని BRS భావిస్తోంది. కానీ కవితనే మళ్లీ పోటీలోని దింపాలని ఉద్యమకారులు కోరుతున్నారు. నిజామాబాద్ ఎంపీ టికెట్‌పై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్‌పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో BRS పరాజయం తర్వాత కవిత భవిష్యత్‌ ఎలా ఉంటుందనే విషయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఓటమి పాలైనప్పటి నుంచి కొద్ది రోజుల పాటు పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు.ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక.. మళ్లీ జిల్లా వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, జగిత్యాల, కోరుట్ల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అయితే ఊహించని విధంగా మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మరో రెండు నియోజకవర్గాల్లో గెలిచారు.అప్పటి వరకు రాబోయే ఎంపీగా ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు కవిత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ ఎమ్మెల్సీ పదవి కాలం మరో నాలుగేళ్లు ఉండటం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మండలిలో పార్టీ గొంతు బలంగా వినిపించాలంటే కవిత మండలిలో ఉండటమే కరెక్ట్ అనే చర్చ జరగుతోంది. దీంతో కవిత ఎంపీగా పోటీ చేయరంటూ పార్టీలోని కొంతమంది చెప్తున్నారు. అయితే కవితే మళ్లీ పోటీ చేయాలని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయకపోతే.. ఎవరిని బరిలోకి దింపుతారనేది జిల్లా నేతల్లో ఆసక్తి రేపుతోంది. నిజాబామాద్ లోక్‌సభకు బీఆర్ఎస్ తరుపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిగా ఉన్న MLC కవిత తప్ప మరో నేత కనిపించడం లేదు.ప్రత్యామ్నాయంగా ఓడిపోయిన అభ్యర్థుల్లో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి పేరును గులాబీ పార్టీ పరిశీలన చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎంపీ అర్వింద్‌ను కట్టడి చేయాలంటే బాజిరెడ్డే సరైన ప్రత్యర్థి అని భావిస్తున్నారు. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయని పక్షంలో బరిలోకి దిగేందుకు రెడీగా ఉండాలని బాజిరెడ్డికి సూచించింది బీఆర్ఎస్ అధిష్ఠానం.నిజామాబాద్ గులాబీ పార్టీలో కొద్దిరోజలుగా ఎమ్మెల్సీ కవిత అనుచరులు ప్రజాగళం కల్వకుంట్ల కవిత అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. మన గళం వినిపించే కవితను గెలిపిద్దామంటూ ప్రచారం చేస్తున్నారు. తాజా పరిణామాలతో కల్వకుంట్ల కవితనే మళ్లీ నిజామాబాద్ ఎంపీ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్ఎస్ కవితను నిజామాబాద్ నుంచి బరిలోకి దింపాలా లేక ప్రత్యామ్నయంగా బాజిరెడ్డితో పోటీ చేయించాలా అన్న డైలామాలో పడింది. ఇంతకీ ఇందూరు బీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత మరోసారి పోటీ చేస్తారా.. లేక కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్